కోలీవుడ్ అగ్ర హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు  విగ్నేశివన్ పై తలపతి విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ ఫైర్ అవుతున్నారు. విగ్నేష్ శివన్ చేసిన ఓ చిన్న మిస్టేక్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ అవుతున్నాడు. స్వయంగా విజయ్ ఫ్యాన్స్ విగ్నేష్ శివన్ ని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటినుంచి సెలబ్రిటీలపై ట్రోలింగ్స్ ఎక్కువ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడ్డారు. బై మిస్టేక్ లో లైక్ కొట్టినా, ఫాలో అయినా, కామెంట్ చేసినా.. నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు.


తాజాగా నయనతార భర్త విగ్నేష్ శివన్ కూడా ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్నాడు. పైగా అది తళపతి విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంట్రవర్సీ కి సంబంధించిన ఇష్యూ కావడంతో విజయ్ ఫ్యాన్స్ విగ్నేష్ శివన్ ను సోషల్ మీడియాలో తెగ ఆడేసుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఆమధ్య తన ట్విట్టర్ బయో నుంచి 'లియో' మూవీని తీసేసాడు. దాంతో లోకేష్ - విజయ్ మధ్య ఏదో జరిగిందని, అందుకే అతను తన ట్విట్టర్ నుంచి లియో మూవీని తొలగించాడని అంతా భావించారు. ఇదే విషయమై లోకేష్ మీడియాతో ముచ్చటించాడు. దీనికి సంబంధించిన ట్రోలింగ్ ట్వీట్ ను విగ్నేష్ శివన్ లైక్ కొట్టాడు.






దీంతో ఓవైపు విజయ్ ఫ్యాన్స్ మరోవైపు లోకేష్ ఫ్యాన్స్ విగ్నేష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా విగ్నేష్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దాంతో తప్పు తెలుసుకున్న విగ్నేష్ తాజాగా ఆ విషయం పై క్లారిటీ ఇస్తూ విజయ్ లోకేష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు కూడా చెప్పాడు. "అసలు ఆ ట్వీట్ దేని గురించి ఉందో? ఆ ఇంటర్వ్యూ ఏంటో చూడకుండా? లోకేష్ ఫోటో ఉంది కదా అని దాని లైక్ చేశాను. తప్పు తెలుసుకొని మళ్లీ డిలీట్ చేశాను. అదొక సిల్లీ మిస్టేక్. దాన్ని పట్టుకుని మీరు టైం వేస్ట్ చేసుకోకండి. విజయ్ సార్, లోకేష్ కనగరాజ్ అంటే నాకు చాలా ఇష్టం. లియో మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అంటూ విగ్నేష్ శివ తన ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. దీంతో విగ్నేష్ శివన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది? మరి ఈ ట్వీట్ తో అయినా విగ్నేష్ శివన్ పై ట్రోలింగ్ ఆగుతుందేమో చూడాలి.


కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ తన ట్విట్టర్ బయో నుంచి లియో సినిమాను తొలగించడానికి కారణాన్ని వెల్లడించారు. "సెన్సార్ పూర్తి అయిన తర్వాత నా బయోలో సినిమా పేర్లు పెట్టాలని అనుకున్నాను. అందుకే లియోని తీసేసాను. సెన్సార్ అయిన తర్వాత మళ్లీ యాడ్ చేశా. రజనీకాంత్ సర్ మూవీని కూడా బయోలో పెట్టలేదు" అంటూ లోకేష్ క్లారిటీ ఇచ్చాడు. ఇక 'లియో' విషయానికి వస్తే.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందింది. సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా.. అర్జున్ సర్జ, సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కానుంది.


Also Read : 'సలార్' ఎఫెక్ట్, మరింత ముందుకు జరిగిన నితిన్ సినిమా - 'ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్' నయా రిలీజ్ డేట్ ఇదే!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial