'సలార్' ఎఫెక్ట్ తో చాలా సినిమాల రిలీజ్ డేట్స్ లో మారుతున్నాయి. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇప్పటికే పలు సినిమాలు తమ రిలీజ్ డేట్ ని మార్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా నితిన్ నటిస్తున్న 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extr Ordinary Man) మూవీ రిలీజ్ డేట్ కూడా మారింది. తొలుత ఈ మూవీని డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ అదే సమయానికి ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'సలార్'(Salar) రిలీజ్ ఉండడంతో మేకర్స్ తాజాగా మరో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా యంగ్ హీరో నితిన్ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.


2020లో 'భీష్మ' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని సాధించలేకపోయాడు. 'భీష్మ' తర్వాత వచ్చిన 'రంగ్ దే' యావరేజ్ గా నిలవగా, గత ఏడాది విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ రచయిత, దర్శకుడు అయిన వక్కంతం వంశీ తో ప్రకటించాడు. 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు ఓ పాటని కూడా రిలీజ్ చేశారు. వీటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో నితిన్ సరికొత్త మేకోవర్ తో దర్శనం ఇవ్వబోతున్నాడు.


సినిమాలో నితిన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23 న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ అదే సమయానికి ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మూవీ విడుదల అవుతూ ఉండడంతో మూవీ టీం మరో కొత్త రిలీజ్ డేట్ ని వెతుక్కోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు డిసెంబర్ 23 నుండి తప్పుకున్న ఈ మూవీని అదే నెలలో కాస్త ముందుగానే విడుదల చేయబోతున్నారు. ' ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీని డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు.


ఈ పోస్టర్లో నితిన్ మరోసారి డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. 'నా పేరు సూర్య' సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న వక్కంతం వంశీ లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ఎన్నో హిట్ సినిమాలకు కథలను అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మొదటి సినిమాతో అపజయం అందుకున్నారు. మరి ఈసారైనా దర్శకుడిగా నితిన్ తో హిట్ కొడతాడేమో చూడాలి. కాగా ఇదే డిసెంబర్ 8వ తేదీన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ కూడా విడుదలవుతోంది. దీంతో డిసెంబర్ 8న నితిన్ Vs వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి.


Also Read : షారుఖ్ ఖాన్​కి హత్యా బెదిరింపులు.. Y+ భద్రతను కల్పించిన ప్రభుత్వం



Join Us on Telegram: https://t.me/abpdesamofficial