Victory Venkatesh's Sankranthiki Vasthunnam Will Telecast On Zee Telugu Channel: ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam). విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమా జనవరి 14న రిలీజై సూపర్ హిట్ టాక్‌తో రికార్డు సృష్టించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేశ్ తన నటన, కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. వెంకీకి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ నటనతో మెప్పించారు. అలాగే, 'బుల్లిరాజు'గా ఛైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. థియేటర్లలోకి రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ సినిమా కోసం ఓటీటీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.


ఓటీటీ కంటే ముందుగానే ఛానెల్‌లో..






కాగా, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను 'జీ5' సొంతం చేసుకోగా.. త్వరలోనే ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. అయితే, అందరూ ఆశ్చర్యపోయేలా ఈ సినిమాను ఓటీటీ కన్నా ఛానెల్‌లోనే ముందుగా ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 'జీ తెలుగు'లో (Zee Telugu) త్వరలో ప్రసారం చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ త్వరలోనే జరగనుందంటూ ప్రోమో విడుదల చేసింది. దీంతో ముందుగా టెలివిజన్ ప్రీమియర్ జరగడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రకటనపై ఓటీటీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ రిలీజ్ ఉంటుందని అంతా భావించారు. అయితే, ముందుగా టీవీలోనే ప్రసారం చేయనున్నట్లు ప్రకటించడంతో వారు నిరాశ చెందుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.


Also Read: 'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్


భారీ హిట్ కొట్టిన 'సంక్రాంతికి వస్తున్నాం'


ఈ సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. వెంకటేశ్ తన కామెడీతో మెప్పించగా అనిల్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాలోని పాటలు సైతం సంగీత ప్రియులను అలరించాయి. 'గోదారి గట్టు', 'మీను', 'బ్లాక్ బస్టర్ సంక్రాంతి' పాటలు యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. గోదారి గట్టు పాటను రమణ గోగుల పాడగా.. 'బ్లాక్ బస్టర్ సంక్రాంతి' పాటను హీరో వెంకీనే స్వయంగా పాడారు. టీజర్ రిలీజ్ నుంచి పాటలు, ప్రమోషన్స్ వరకూ అన్నీ హైలైట్‌గానే నిలిచాయి. అటు, ఇదే సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ డివైడ్ టాక్ తెచ్చుకోగా.. బాలకృష్ణ డాకు మహారాజ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.


Also Read: పవన్ కల్యాణ్ 'తీన్ మార్' రీ రిలీజ్ - నిర్మాత బండ్ల గణేష్ ఫుల్ క్లారిటీ, అది సాధ్యమేనా అంటూ సందేహాలు!