Vicky Kaushal's Chhaava Telugu Trailer: బాలీవుడ్ టాప్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ఛావా' (Chhaava). ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగు వెర్షన్‌ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ బ్యానర్‌పై మార్చి 7న రిలీజ్ చేయనుండగా.. తాజాగా మూవీ టీం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' తెలుగులోనూ అదే హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీలో శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక అద్భుతంగా నటించారు. 'మరాఠాల సింహం లేనప్పటికీ తన వేటను ఈ ఛావాను కొనసాగిస్తాడు', 'గర్జనకు లొంగకపోతే పంజా వేటు తప్పదు' అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
Also Read: ఏడాది తర్వాత ఆ ఓటీటీలోకి శర్వానంద్ 'మనమే' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
బాక్సాఫీస్ వద్ద రికార్డులు
ఫిబ్రవరి 14న హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటన, యాక్షన్ వేరే లెవల్. ఆయన భార్య యేసుబాయి రోల్‌లో రష్మిక నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు, బీజీఎంకు ప్రేక్షకులు జేజేలు పలికారు. దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించగా.. మూవీలో అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ, అశుతేష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, కిరణ్ కర్మాకర్, అలోక్ నాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదలై చాలా రోజులైనా ఇప్పటికీ ఆ హిస్టారికల్ మేనియా నడుస్తుందంటేనే ఆడియన్స్ ఈ మూవీలో నటనకు ఎంత అడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. థియేటర్లలో క్లైమాక్స్ సన్నివేశాల్లో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుని నినాదాలు చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇప్పటివరకూ ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది.
దీంతో ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయాలనే డిమాండ్లు పెరిగాయి. దీంతో మేకర్స్ తెలుగు వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఈ నెల 7న థియేటర్లలోకి ఈ మూవీ తెలుగు వెర్షన్ రానుంది. సినిమాలో హీరో పాత్రకు టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తారనే రూమర్స్ వినిపించినా అది నిజం కాదని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ సైతం అంతే హిట్ అవుతుందని భావిస్తున్నారు.
Also Read: ఆస్కార్స్‌లో బ్రాడీ, హాలే బెర్రీ లిప్ లాక్ - 22 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. వైరల్ వీడియో చూశారా?