Oscars 2025: ఆస్కార్స్‌లో బ్రాడీ, హాలే బెర్రీ లిప్ లాక్ - 22 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. వైరల్ వీడియో చూశారా?
Oscars 2025 Highlights: 97వ అంతర్జాతీయ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే హాలీవుడ్ హీరో నటికి ముద్దు పెట్టుకున్నారు.

Adrien brody Halle berry kissing On Oscars 2025 Red Carpet: సినీ పరిశ్రమలో నోబెల్ బహుమతిగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక 2025 (Oscars 2025) అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్‌లో వైభవంగా సాగుతోంది. 97వ అంతర్జాతీయ అకాడెమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ప్రముఖ నటులతో పాటు, సాంకేతిక నిపుణులు సైతం హాజరయ్యారు. ప్రముఖ నటీమణులు ఫ్యాషన్ దుస్తులతో మెరిశారు. ఈ క్రమంలో ఆస్కార్ వేదికగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ హాలీవుడ్ హీరో అందరూ చూస్తుండగానే హీరోయిన్‌కు ముద్దు పెట్టారు. హీరో ఆడ్రిన్ బ్రాడీ (Adrien Brody) నటి హాలీ బెర్రీ (Halle Berry) 2025 అవార్డుల్లో నామినేట్ కాగా.. ఫంక్షన్‌కు వచ్చారు. మీడియాతో మాట్లాడుతున్న ఆడ్రియన్ బ్రాడీ దగ్గరకు హాలీ బెర్రీ రాగానే ఆమెను ముద్దు పెట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే కెమెరాల ముందు కిస్ చేశారు. ఈ సీన్ చూసి ఒక్కసారిగా షాకైన అక్కడి వారంతా అనంతరం చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేశారు. ఈ సీన్‌ను అకాడమీ తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది. '22 ఏళ్లలో పునఃకలయిక' అంటూ క్యాప్షన్ పెట్టగా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది రెండోసారి..
అయితే.. ఆడ్రిన్ బ్రాడీ, హాలీ బెర్రీ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. 2003 ఆస్కార్ అవార్డుల టైంలో కూడా వీరు ఇలాగే చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2003 ఆస్కార్ అకాడెమీ అవార్డ్స్ ఫంక్షన్‌లో 'ది పయానిస్ట్' చిత్రానికి ఉత్తమ నటుడిగా బ్రాడీ అవార్డు గెలుచుకున్నారు. అనంతరం స్టేజీ మీదే హాలీ బెర్రీని ముద్దు పెట్టుకున్నాడు. అప్పట్లో ఇది సంచలనంగా మారి కాంట్రవర్సీకి దారితీసింది. మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2025 అకాడెమీ అవార్డ్స్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
మరోవైపు, ఆస్కార్ అవార్డుల వేడుకలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన 'అనోరా'కు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ ఇలా 5 విభాగాల్లో ఆస్కార్స్ సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అడ్రిన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), అనోరాలో నటనకు ఉత్తమ నటిగా 'మైకీ మ్యాడిసన్' అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్ (అనోరా) అవార్డు సాధించారు.
జాబితా ఇదే..
- ఉత్తమ చిత్రం: అనోరా (దర్శకుడు - షాన్ బేకర్, నిర్మాతలు - అలెక్స్ కోకో, సమంత క్వన్, షాన్ బేకర్)
- ఉత్తమ దర్శకుడు: షాన్ బేకర్ (అనోరా సినిమా)
- ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ - Adrien Brody (ది బ్రూటలిస్ట్)
- ఉత్తమ నటి: మైకీ మెయిడ్ సన్ (అనోరా సినిమా)
- ఉత్తమ సహాయ నటుడు: Kieran Culkin (ఏ రియల్ పెయిన్ సినిమా)
- ఉత్తమ సహాయ నటి: జోయ్ సల్దానా (ఎమిలీయా పెరీజ్ సినిమా)
- ఉత్తమ ఛాయాగ్రహణం: లోల్ క్రావ్లీ (ది బ్రూటలిస్ట్ సినిమా)
- బెస్ట్ సౌండ్: 'డ్యూన్ పార్ట్ 2'కు గాను రిచర్డ్ కింగ్, డగ్ హెమ్‌ఫిల్, రాన్ బార్ట్‌లెట్, గరేత్ జాన్
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్: 'ది బ్రూటలిస్ట్' సినిమాకు గాను డేనియల్ బ్లమ్ బర్గ్
- ఉత్తమ పాట (ఒరిజినల్ సాంగ్): 'ఎమిలీయా పెరీజ్' సినిమాలోని 'ఎల్ మాల్'
- బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నో అదర్ ల్యాండ్
- బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: అయామ్ నాట్ రోబోట్
- బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద ఓన్లీ గాళ్ ఇన్ ద ఆర్కెస్ట్రా
- బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్: అయామ్ స్టిల్ హియర్ (బ్రెజిల్ సినిమా - వాల్టర్ సాలస్ దర్శకత్వం వహించారు)
- బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: 'ఫ్లో' (Flow)
- బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రెస్ (In The Shadow Of The Cypress)
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: 'డ్యూన్ పార్ట్ 2'కు గాను పాల్ లాంబెర్ట్, స్టీఫెన్ జేమ్స్, గ్రెడ్, రైస్
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: షాన్ బేకర్ (అనోరా)
- బెస్ట్ కాస్టూమ్ డిజైనర్: 'వికెడ్' సినిమాకు గాను పాల్ తాజ్‌వెల్
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: 'వికెడ్'కు గాను నాథన్ క్రావ్లీ, లీ సాండలీస్