డిఫరెంట్ సినిమాలతో దర్శకుడిగా తమకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్ కొంత మంది ఉన్నారు. అటువంటి వారిలో వీఐ ఆనంద్ ఒకరు. డిఫరెంట్ కాన్సెప్ట్స్, కథలు తీసుకుని థియేటర్లలో ప్రేక్షకులకు యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఆయన స్టైల్. ఇప్పుడు ఆయన ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారని తెలిసింది.
టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరితో...పాన్ ఇండియా లెవెల్ సోషియో ఫాంటసీ!దర్శకుడిగా వీఐ ఆనంద్ (VI Anand)ది సపరేట్ స్టైల్. సందీప్ కిషన్ హీరోగా తీసిన 'టైగర్' పక్కన పెడితే... నిఖిల్ సిద్ధార్థ హీరోగా డైరెక్ట్ చేసిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', అల్లు శిరీష్ హీరోగా దర్శకత్వం వహించిన 'ఒక్క క్షణం', మాస్ మహారాజా రవితేజతో తీసిన 'డిస్కో రాజా', సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' సినిమాలు గమనించండి! ప్రతి సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసే కాన్సెప్ట్ ఉంటుంది.
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద రానటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని సినిమా చేయడం వీఐ ఆనంద్ స్టైల్. ఇప్పుడు ఆయన ఒక భారీ సోషియో ఫాంటసీ ఫిలిం ప్లాన్ చేశారని తెలిసింది. ఇది ఇద్దరు హీరోల సబ్జెక్ట్. ఇందులో టాలీవుడ్ టాప్ హీరోలు నటించనున్నారట. ప్రస్తుతం హీరోలతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. మల్టీస్టారర్ కనుక కాస్త సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారు వీఐ ఆనంద్. ఒక్కసారి హీరోలు ఫైనలైజ్ అయ్యాక... ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Also Read: 'వచ్చినవాడు గౌతమ్' టీజర్ లాంచ్‌లో రమ్య మోక్ష... పికిల్స్ కాంట్రవర్సీ నుంచి సెలబ్రిటీగా
వీఐ ఆనంద్ డైరెక్షన్ ఆయన స్టోరీ సెలక్షన్ మీద హీరోలకు మంచి అభిప్రాయం ఉంది. దాంతో త్వరలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ప్రొడ్యూసర్ కూడా భారీ బడ్జెట్ పెట్టి తీయడానికి రెడీగా ఉన్నారు.
భారీ స్థాయిలో తీసేందుకు నిర్మాత రెడీ...'హనుమాన్', 'సంబరాల ఏటిగట్టు' తర్వాత!ఇద్దరు హీరోలతో దర్శకుడు వీఐ ఆనంద్ ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా లెవెల్ సోషల్ ఫాంటసీ ఫిలింను ప్రొడ్యూస్ చేయడానికి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి రెడీగా ఉన్నారు. 'హనుమాన్' సినిమాతో ఆయన భారీ విజయం అందుకున్నారు. ప్రస్తుతం సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ హీరోగా 'సంబరాల ఏటిగట్టు' సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు వీఐ ఆనంద్ సినిమాతో పాటు మరో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు తీసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
Also Read: బికినీలో కావ్య థాపర్... థాయ్‌లాండ్ ట్రిప్‌లో ఫుల్ గ్లామర్ షో