Ramya Krishna and Veny Swamy Old Photo: పై ఫొటోను చూశారా? ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య ఉన్న ఆ వ్యక్తిని గుర్తుపట్టారా? అదేంటీ.. ఆ ఫొటోలో ఉన్న నగ్మ, రమ్యకృష్ణ గురించి చెప్పకుండా.. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? ఎందుకంటే.. ఆ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఎంతోమంది సెలబ్రిటీలకు ఆయన ఫేవరెట్. ఇంతకీ ఆయన మరెవ్వరో కాదు.. వేణుస్వామి. 


టాలీవుడ్‌లో సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు వేణు స్వామి. ఈయన సెలబ్రిటీల జీవితాల్లో జరిగే విషయాల గురించి ముందే అంచనా వేస్తూ.. అందరికీ షాకిచ్చారు. అయితే సోషల్ మీడియా అనేది ఉంది కాబట్టి వేణు స్వామికి విపరీతమైన పాపులారిటీ లభించింది. కానీ ఇవేమీ లేక ముందు నుండే సినిమా కార్యక్రమాల్లో వేణు స్వామి పూజలు చేసేవారని తాజాగా వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే అర్థమవుతోంది. ఆ ఫోటోలో వేణు స్వామితో పాటు రమ్యకృష్ణ కూడా ఉన్నారు. వీరితో పాటు హీరోయిన్ నగ్మ కూడా ఉన్నారు. ఈ ఫోటో చూసిన వారంతా అసలు ఇది ఎప్పటిది అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.


అప్పటి ఫోటో..


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఒకప్పుడు ఫోటోలో ఉన్నది వేణు స్వామి అని ముందుగా ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. రమ్యకృష్ణ, నగ్మల మధ్య ఒక కుర్ర పూజారిగా ఆయన నిలబడి ఉన్నారు. కానీ గమనించి చూస్తే.. ఆయన వేణు స్వామి అని అర్థమవుతుంది. ఒకప్పుడు నగ్మ, రమ్యకృష్ణ కలిసి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ముగ్గురు మొనగాళ్లు’ అనే సినిమా చేశారు. ఇందులో చిరంజీవి ట్రిపుల్ రోల్‌లో కనిపించగా.. ఒక్కొక్క క్యారెక్టర్‌కు ఒక్కొక్క హీరోయిన్‌ను సెలక్ట్ చేశారు దర్శకుడు రాఘవేంద్ర రావు. అలా ‘ముగ్గురు మొనగాళ్లు’లో నగ్మ, రమ్యకృష్ణ, రోజా హీరోయిన్లుగా నటించారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న నగ్మ, రమ్యకృష్ణ, వేణు స్వామిల పాత ఫోటో కూడా అప్పటిదే కావచ్చని భావిస్తున్నారు. 


ఆ తర్వాతే పాపులారిటీ..


సినీ సెలబ్రిటీల్లో ఎక్కువగా సెంటిమెంట్స్‌ను, జాతకాలను నమ్మేవారు ఉంటారు. వారంతా వేణు స్వామి దగ్గరికే వస్తారు. ఆయన చెప్పే జ్యోతిష్యం చాలావరకు కరెక్ట్ అవుతుందని వారంతా నమ్ముతారు. ముందుగా నాగచైతన్య, సమంత పెళ్లయిన కొత్తలోనే వీరిద్దరూ కలిసి ఉండరని స్టేట్‌మెంట్ ఇచ్చారు వేణు స్వామి. కానీ అప్పుడు ఆయన మాటలను ఎవరూ వినలేదు, పట్టించుకోలేదు. కానీ నిజంగానే నాగచైతన్య, సమంత.. తమ విడాకుల గురించి ప్రకటించిన తర్వాత వేణు స్వామి చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు నెటిజన్లలో విపరీతమైన పాపులారిటీ లభించింది. చాలామంది సెలబ్రిటీలకు కూడా ఆయన ఎవరో తెలిసింది.


రాజకీయ నాయకులు కూడా..


ఇప్పటికీ కూడా చాలామంది సెలబ్రిటీలు వేణు స్వామి దగ్గరికి పూజలు చేయించుకోవడానికి వస్తారు.తాజాగా రష్మిక మందనా సైతం వేణు స్వామితో కలిసి పూజలు నిర్వహించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అషూ రెడ్డిలాంటి సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా ఆయనతోనే పూజలు చేయించుకోవడానికి ఇష్టపడతారు. కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు సైతం వేణు స్వామి జ్యోతిష్యాన్ని నమ్ముతారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల, సెలబ్రిటీల భవిష్యత్తుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయినా కూడా కాంట్రవర్సీల వల్ల ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆయనకు అనిపించింది అనిపించినట్టుగా చెప్తేస్తూ ఉంటారు వేణు స్వామి. 


Also Read: వాలెంటైన్స్ డే స్పెషల్ - భార్యతో కలిసి హాలిడేకు వెళ్లిన చిరు, ఎక్కడికో తెలుసా?