కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ లో దర్శకుడు శంకర్ బిజీగా ఉన్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ నెగటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  


‘ఇండియన్ 2’ షూటింగ్ ప్రస్తుతం చైన్నైలో జరుగుతోంది. కాగా స్టార్ కమెడియన్ వెన్నల కిషోర్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు రవిచందర్ సంగీతం అందించున్నాడు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడెక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 


శంకర్ మరోవైపు రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా RC15 సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. రామ్ చరణ్ మూవీ షూటింగ్ ఏప్రిల్ లేదంటే మేలో కంప్లీట్ అవుతుంది. ముందుగా ఈ సినిమా కంప్లీట్ కాగానే కమల్ హాసన్ ‘ఇండియన్2’పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేయనున్నారు. రెండు సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకేసారి నిర్వహించనున్నారు.


దీపావళికి ‘ఇండియన్2’ విడుదల


అయితే, తాజాగా ఈ సినిమాలకు సంబంధించి విడుదలపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అఫీషియల్ ప్రకటన రాకపోయినా రెండు సినిమాలను రెండు పండుగల సందర్భంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇందుకు దీపావళి, సంక్రాంతిని ఫిక్స్ చేశారట. కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్2’ చిత్రాన్ని దీపావళి  కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారట. నిజానికి కొన్ని సంవత్సరాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో భారీ సినిమాలను దీపావళి సెలవుల సందర్భంగా విడుదల చేయడం మానేశారు. ‘ఇండియన్2’తో మళ్లీ దీపావళికి భారీ బడ్జెట్ సినిమాల విడుదలకు జీవం పోయనున్నారు. 1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ సినిమా ‘ఇండియన్’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో ‘భారతీయుడు’గా ఈ సినిమా విడుదల అయ్యింది. వసూళ్ల పరంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. తమిళంతో పాటు తెలుగులోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. కమల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.


 సంక్రాంతి బరిలో చెర్రీ మూవీ


ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘RC15’ సినిమా వచ్చే ఏడాది అంటే, 2024 సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ చరణ్‌ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తుండగా.. పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. అయితే, కియారా పెళ్లి కారణంగా ఈ సినిమాలోని ఒక పాట షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే రెండు సినిమాకు సంబంధించిన విడుదల తేదీ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.




Read Also: 'మామా మశ్చీంద్ర' మూవీ వీడియో లీక్, సుధీర్ బాబు లుక్ చూసి ఆడియన్స్ షాక్!