తాజాగా ‘హంట్’ సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. 2018 లో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ మధ్యలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో కొంత మేర ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా ఆయన  ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నారు.

  


తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది. ఇందులో సుధీర్ బాబు లుక్ చూసి ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. ఆయన భారీ దేహంతో కనిపిస్తున్నాడు. సుమారు 150 కిలలో బరువున్న వ్యక్తిగా సుధీర్ బాబు ఈ సినిమాలో కనిపించనున్నట్లు ఈ వీడియో ద్వారా అర్థం అవుతోంది. ఇందుకోసం ఆయన భారీగా బరువు పెరగడంతో పాటు సరికొత్త గెటప్, ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధమైన బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు చిన్న వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇవి సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచాయి.  


సుధీర్ బాబు లుక్ చూసి ఆడియెన్స్ షాక్!


తాజాగా లీకైన వీడియోలో లుక్ కు ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ లుక్ కు అస్సలు పోలికలేకపోవడం విశేషం. అఫీషియల్ గా విడుదలైన గ్లింప్స్ లో సుధీర్ బాబు  సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకున్నాడు. ఈ వీడియోలో అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నారు. అయితే, ఈ చిత్రంతో తను డ్యుయెల్ రోల్ చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






ఫస్ట్ లుక్, గ్లింప్స్ లో సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకున్న సుధీర్ బాబు


ఫస్ట్ లుక్, గ్లింప్స్ లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనబడ్డాడు. ఇప్పుడు ఈ వీడియోలో దానికి పూర్తి బిన్నంగా కనిపించాడు. దీంతో ఈ సినిమాలో సుధీర్ బాబు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడా? అని సందేహం పడుతున్నారు నెటిజెన్లు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో తమిళ హీరోయిన్ మిర్నాళిని రవి  సుధీర్ బాబు సరసన నటిస్తుంది. తెలుగు నటుడు హర్షవర్ధన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


ఇక సుధీర్ బాబు ఇటీవలి కాలంలో  బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేకపోతున్నాడు.  అతడి గత  చిత్రాలైన ‘వేట’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ‘మామా మశ్చీంద్ర’ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని భావిస్తున్న ఆయన సరికొత్త ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడు. 


Read Also: పవన్ కళ్యాణ్ పర్శనల్ లైఫ్ చూసి ఓటేయరు - రోజాకు అదే బలం: సీనియర్ నటి కస్తూరీ కామెంట్స్