విక్టరీ వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద అగ్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో కథానాయికగా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్టు ఇవాళ అనౌన్స్ చేశారు. శ్రీనిధి బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
వెంకటేష్ జంటగా శ్రీనిధి శెట్టి!త్రివిక్రమ్ - వెంకీలది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. త్రివిక్రమ్ రచనలో వెంకీ నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా వాళ్ళ సినిమాల్లో సున్నితమైన హాస్యం, కుటుంబ విలువలకు తెలుగు ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై స్పెషల్ క్రేజ్ నెలకొంది.
త్రివిక్రమ్ సినిమాల్లో కథానాయికలకు ప్రాముఖ్యం ఉంటుంది. కేవలం పాటలకు, రెండు మూడు సన్నివేశాలకు మాత్రమే కథానాయికలను పరిమితం చేయకుండా కథలో ప్రాముఖ్యం ఇస్తారు. అందుకని, త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్లకు నటిగా పేరు కూడా వస్తుంది. అందువల్ల తెలుగులో శ్రీనిధి శెట్టికి ఇది ఇంపార్టెంట్ సినిమా అవుతుందని చెప్పవచ్చు.
Also Read: తేజా సజ్జా క్రేజ్ అట్లుంది మరి... అప్పుడే 'జాంబీ రెడ్డి 2' ఓటీటీ డీల్ క్లోజ్
రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్'తో కథానాయికగా శ్రీనిధి శెట్టికి పాన్ ఇండియా హిట్ లభించింది. ఆ తర్వాత తమిళంలో చియాన్ విక్రమ్ సరసన 'కోబ్రా'లో ఆమె నటించారు. న్యాచురల్ స్టార్ నానికి జంటగా నటించిన 'హిట్ 3' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆవిడ పరిచయం అయ్యారు. దీపావళికి విడుదలైన 'తెలుసు కదా' సినిమాలోనూ ఆమె నటించారు. ఇప్పుడు త్రివిక్రమ్ - వెంకీ సినిమాలో అవకాశం అందుకున్నారు.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలో ప్రొడక్షన్ 8. హీరోగా వెంకీ 77వ చిత్రమిది. సూర్యదేవర రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ శ్రీనిధి శెట్టి మీద ఒక ఫోటోషూట్ చేశారని, ఆమె షూటింగులో జాయిన్ అయ్యారని టాక్.