Kiran Abbavaram's K Ramp Movie Collections Till Now: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా 'కే ర్యాంప్'. దీపావళి బరిలో అన్నిటి కంటే ఆలస్యంగా విడుదలైన చిత్రమిది. అయితే అన్నిటి కంటే ముందుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యింది. మూడు రోజుల్లో ఈ ఘనత సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Continues below advertisement

మూడు రోజుల్లో 17 కోట్ల కంటే ఎక్కువ!K Ramp 3 Days Collection: కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్' మూవీ హౌస్ ఫుల్ షోలతో దూసుకు వెళుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 17.5 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది.

Also Read: సుకుమార్ క్యాంపు నుంచి లేడీ డైరెక్టర్... ఆ సినిమాలో హీరో ఎవరంటే?

Continues below advertisement

'కే ర్యాంప్' చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే రివ్యూల్లో అసలు బాలేదని రాశారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ సైతం బావుంది. దాంతో రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. నగరాల్లో మాత్రమే కాదు... బీ, సీ సెంటర్ ప్రేక్షకుల్లోనూ ఆదరణ కనబడుతోంది. ప్రతి చోట థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థలపై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం అయ్యారు.

Also Readథామా ఫస్ట్ రివ్యూ... బాలీవుడ్‌లో రష్మిక హారర్ కామెడీ... సినిమా హిట్టా? ఫట్టా? ప్రీమియర్స్ టాక్ ఏమిటంటే?