Mahesh Babu And Rajamouli's Movie SSMB29 Title: సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఓ భారీ పాన్ వరల్డ్ / గ్లోబ్ ట్రాటింగ్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. దీనికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సంగతి పాన్ ఇండియా ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినిమాలపై కన్నేసిన హాలీవుడ్ ఫిల్మ్ సెలబ్రిటీలకు, క్రిటిక్స్ & ప్రేక్షకులకు తెలుసు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ గురించి రాజమౌళి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మీడియా ముందుకు రాలేదు. వచ్చే నెల రానున్నట్టు తెలుస్తోంది.
నవంబర్ నెలలో... హైదరాబాద్ సిటీలో!ప్రస్తుతం అక్టోబర్ నెల నడుస్తోంది. వచ్చేది నవంబర్ నెల. ఆ నెలలో 11 లేదా 15వ తేదీల్లో హైదరాబాద్ సిటీలో ఒక ఈవెంట్ ప్లాన్ చేయాలని మహేష్, రాజమౌళి & కో సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. అందులో సినిమా టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఒక చిన్న వీడియో గ్లింప్స్ సైతం విడుదల చేయడానికి ప్లాన్ చేశారట.
జేమ్స్ కామెరూన్ వస్తారా? టైటిల్ అదేనా!?మహేష్, రాజమౌళి సినిమా ఓపెనింగ్ జరిగిన రోజే హైదరాబాద్ సిటీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ జరిగింది. దానికి రాజమౌళి అతిథిగా వచ్చారు. అందులో ఓపెనింగ్ లేదా పూజ గురించి చెప్పడానికి ఆయన అసలు ఇష్టపడలేదు. ఆ తర్వాత సెట్స్ నుంచి వీడియోలు లీక్ అయ్యాయి. షూటింగ్ స్పాట్ నుంచి ఎవరో రహస్యంగా వీడియోలు తీసి లీక్ చేశారు. అయినా సరే రాజమౌళి ఒక్క మాట మాట్లాడలేదు. సో నవంబర్ నెలలో నిర్వహించబోయే పబ్లిక్ ఈవెంట్ ఈ సినిమా మొట్టమొదటి ఈవెంట్ అవుతుంది.
Also Read: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్య గొడవలా? 'డ్రాగన్' ఆగిందా? అసలు నిజం ఏమిటంటే?
మహేష్, రాజమౌళి సినిమాకు 'మహారాజ్', 'గ్లోబ్ ట్రాటర్', 'గరుడ', 'జెన్ 63' వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. సినిమాలో హీరో పేరు రుద్ర అని టాక్. అయితే ఆ టైటిల్స్ ఏవీ ఖరారు చేయలేదని, 'వారణాసి' టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. ఆ టైటిల్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది. 'అవతార్ 3' ప్రచార కార్యక్రమాల కోసం హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియా రానున్నారు. ఆయన చేత టైటిల్ రివీల్ చేయించాలనేది రాజమౌళి ప్లాన్.
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న SSMB29లో గ్లోబల్ స్థాయికి వెళ్లిన ఇండియన్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, తమిళ నటుడు మాధవన్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర పాత్రలు చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. రాజమౌళి లాస్ట్ సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో కీరవాణి అందించిన 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చింది. దాంతో ఈ సినిమా సంగీతంపై అంచనాలు ఉన్నాయి.