Balakrishna's Akhanda 2 Latest Update: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా మైథాలజీ సినిమా 'అఖండ 2 తాండవం'. ఇప్పటికే ఒక టీజర్ రిలీజ్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే మరొక టీజర్ రిలీజ్ కానుంది.
అక్టోబర్ 24న 'అఖండ 2' కొత్త టీజర్!Akhanda 2 Thandavam New Teaser: ఈ నెల (అక్టోబర్) 24న 'అఖండ 2 తాండవం' కొత్త టీజర్ విడుదల కానుంది. 'నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు అయినా సరే కన్నెత్తి చూడడు... నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా??' అంటూ ఇప్పటికే విడుదలైన టీజర్‌లో పవర్ ల్ డైలాగ్ చెప్పారు బాలకృష్ణ. ఇప్పుడు విడుదల కాబోయే కొత్త టీజర్ లో సైతం ఆయన పవర్ఫుల్ డైలాగ్ ఉంటుందట. అది అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట.
డిసెంబర్ 5న థియేటర్లలోకి సినిమాAkhanda 2 Release Date: 'అఖండ 2'చిత్రాన్ని తొలత సెప్టెంబర్ 25న విడుదల చేయాలని భావించారు. అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఉండడంతో పాటు సినిమా నేపథ్య సంగీత పనులు పూర్తి కావడానికి మరింత సమయం అవసరం అవుతుందని వాయిదా వేశారు.
Also Read: పద్మవ్యూహాన్ని చేధించిన పార్ధు... రెబల్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ 'ఫౌజీ' అప్డేట్ ఇచ్చిన హను!
డిసెంబర్ 5న థియేటర్లలోకి సినిమా రానుంది. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఫిలింస్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా 'అఖండ 2 తాండవం'. దీంతో డబల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి కూడా అడుగు పెడుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
బాలకృష్ణ సరసన సంయుక్త కథానాయికగా నటించిన 'అఖండ 2 తాండవం'లో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.