Watch Ravi Teja's Mass Jathara Movie Songs: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'మాస్ జాతర'. ఈ నెల (అక్టోబర్) 31న థియేటర్లలోకి వస్తోంది. 'ధమాకా' తర్వాత రవితేజ జంటగా శ్రీ లీల (Sreeleela) నటిస్తున్న చిత్రమిది. 'ధమాకా'కు సూపర్ డూపర్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ, శ్రీలీల సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

Continues below advertisement

సూపర్ డూపర్ హిట్టు సాంగ్!'మాస్ జాతర' నుంచి ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. ఒకటి... తూ మేరా లవ్వరు. ఏఐ ద్వారా ఆ పాట కోసం చక్రి వాయిస్ రీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత 'ఓలే ఓలే' సాంగ్ రిలీజ్ చేశారు. మూడో పాటగా హుడియో హుడియో...' వచ్చింది. ఆ మూడు పాటలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటికి మంచి అన్నట్టు... దీపావళి సందర్భంగా నాలుగో సాంగ్ ప్రోమో విడుదల చేశారు. 

'సూపర్ డూపర్...' పేరుతో 'మాస్ జాతర'లో నాలుగో పాట ప్రోమో విడుదల చేశారు. ఈ పాటకు భీమ్స్ చార్ట్ బస్టర్ ట్యూన్ ఇవ్వగా... మాస్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సురేష్ గంగుల మాంచి మాసీ లిరిక్స్ రాశారు.

Continues below advertisement

'ఈ పాటకు రిథమ్ లేదు...కదం లేదు... పదం లేదు...అర్థం లేదు... పర్థం లేదు...స్వార్థం గీర్థం అసలు లేదు...సూపర్ డూపర్ హిట్టు సాంగ్!

ఈ పాటకు స్కేల్ లేదు...పెన్ను లేదు...పేపర్ లేదు...తాళం లేదు... తలుపులు లేవు...సూపర్ డూపర్ హిట్టు సాంగ్' అని సాగింది ప్రోమో.

'సూపర్ డూపర్...' ఫుల్ సాంగ్ అక్టోబర్ 22న విడుదల కానుంది. గాయని రోహిణి సరోట్, సంగీత దర్శకుడు భీమ్స్ ఈ పాట ఆలపించారు. ఇప్పటి వరకు 'మాస్ జాతర' నుంచి విడుదలైన ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ 'సూపర్ డూపర్ హిట్ సాంగ్' ఉంటుందని ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది.

Also Readథామా ఫస్ట్ రివ్యూ... బాలీవుడ్‌లో రష్మిక హారర్ కామెడీ... సినిమా హిట్టా? ఫట్టా? ప్రీమియర్స్ టాక్ ఏమిటంటే?

'సామజవరగమన', 'వాల్తేరు వీరయ్య'తో పాటు పలు సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పని చేసిన భాను భోగవరపు 'మాస్ జాతర'తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ కనిపించనున్నారు.

Also Readశివంగిలా సన్నీ లియోన్... 'త్రిముఖ' సినిమాలో రోల్ అదే - టీజర్ చూశారా?