Sharwanand 36th Movie Title Announced: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస మూవీస్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన మూవీ సంక్రాంతి బరిలో నిలవగా తాజాగా మరో మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పటివరకూ ఆయన్ను ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్స్‌లో చూసిన ఆడియన్స్ ఈసారి డిఫరెంట్ లుక్‌లో చూడబోతున్నారు.
డిఫరెంట్ టైటిల్
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ తన 36వ సినిమా చేస్తుండగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఏడాది దాటిపోయింది. తాజాగా దీపావళి సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ అనౌన్స్ చేశారు మేకర్స్. యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీకి 'బైకర్' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేయగా... స్టైలిష్, యూత్ ఫుల్ లుక్‌లో శర్వా అదరగొట్టారు. 'జీవితంలో ప్రతీ మూలను, ప్రతీ జంప్‌ను, ప్రతీ అడ్డంకిని జయించి కీర్తిని లక్ష్యంగా పెట్టుకోండి.' అంటూ రాసుకొచ్చారు.
ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ శర్వా తండ్రిగా నటించనున్నారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తుండగా... గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటివరకూ ఫ్యామిలీ ఆడియన్స్‌కే కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేసిన శర్వానంద్... తాజాగా కంప్లీట్ యూత్‌కు కనెక్ట్ అయ్యే జానర్‌ను ఎంచుకున్నారు. ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది.
హ్యాట్రిక్ హిట్స్...
ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... యూవీ క్రియేషన్స్ బ్యానర్ విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ బ్యానర్‌లో శర్వాతో చేసిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. 'రన్ రాజా రన్', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'మహానుభావుడు' మూవీస్ మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ జానర్ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... త్వరలోనే ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
సంక్రాంతి బరిలో...
ఇక మరో మూవీ 'నారీ నారీ నడుమ మురారి' మూవీతోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు శర్వా. ఈ మూవీకి 'సామజవరగమన' ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా... కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. దీంతో పాటే శ్రీను వైట్ల మూవీకి కూడా శర్వా ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.