రాకింగ్ స్టార్ మనోజ్ మంచు 'కరెంట్ తీగ'తో సన్నీ లియోన్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అందులో అతిథి పాత్రలో నటించారు. అంతకు ముందు ఆవిడ హిందీ సినిమాలు చేశారు. వేరే సినిమాలు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కు తెలుసు. 'కరెంట్ తీగ' తర్వాత యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 'పీఎస్వీ గరుడవేగ'లో స్పెషల్ సాంగ్ చేశారు. ఆ తర్వాత విష్ణు 'జిన్నా' చేశారు. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'త్రిముఖ'. దీపావళి సందర్భంగా టీజర్ విడుదల చేశారు. అందులో సన్నీ రోల్ ఏమిటి? అనేది రివీల్ అయ్యింది.

Continues below advertisement

సీఐడీ ఆఫీసర్... ఏసీపీ శివానీ రాథోడ్!Sunny Leone Role In Trimukha Movie: 'త్రిముఖ'లో సన్నీ లియోన్ క్యారెక్టర్ పేరు శివానీ రాథోడ్. వృత్తిరీత్యా ఆవిడ పోలీస్ ఆఫీసర్. ఏసీపీ ర్యాంక్ అధికారి. సీఐడీలో వర్క్ చేస్తోంది. ఇక 'త్రిముఖ' కథ విషయానికి వస్తే... నగరంలో కలకలం రేపుతున్న వరుస మిస్సింగ్ కేసులను శివానీ రాథోడ్ ఎలా సాల్వ్ చేసింది? అనేది సినిమా. 

'త్రిముఖ' చిత్రాన్ని అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మిస్తున్నారు. రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. టీజర్ విషయానికి వస్తే... ''ఓటమి ఎరుగని శివంగి. కానీ, ఎదురుగా యుద్దం... తాను ఎప్పుడైనా సిద్ధం... ఇప్పుడు ఎదురైంది ఛేదించలేని పద్మవ్యూహం... తన చుట్టూ అలుముకుంది సందిగ్ధం'' అంటూ సన్నీ పాత్ర గురించి హైప్ ఇచ్చారు. ఆ తర్వాత ఇతర పాత్రలనూ పరిచయం చేశారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్‌ అని అర్థం అవుతోంది.

Continues below advertisement

Also Read: టాలీవుడ్ పెద్దలకు బండ్ల గణేష్ దివాళీ పార్టీ - ఖర్చు ఎంతో తెలుసా?

నిర్మాతలలో ఒకరైన శ్రీదేవి మద్దాలి మాట్లాడుతూ... ''ఐదు భాషల్లో మా 'త్రిముఖ' టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. కథపై, సినిమాపై మాకు చాలా నమ్మకం ఉంది. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ... ''ఈ సినిమా వెనుక మాయా చిత్ర బృందం కొన్నేళ్లు పడిన కష్టం ఉంది. దీంతో మేం మా సరిహద్దులు దాటబోతోన్నాం. మా శ్రమను టీజర్ ద్వారా ప్రేక్షకులు అందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాం. ప్రేక్షకులు థియేటర్లలో విజువల్ వండర్ అందించబోతున్నాం'' అని అన్నారు.

Also Read: నేషనల్ అవార్డ్ వస్తే డస్ట్ బిన్‌లో వేస్తా - కోట్లు ఇచ్చినా అలాంటి రోల్ మళ్లీ చేయను... తమిళ హీరో విశాల్ సెన్సేషనల్ కామెంట్స్

Trimukha movie cast and crew: 'త్రిముఖ'లో సన్నీ లియోన్‌ సహా యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్ట రాజేంద్రన్, అషు రెడ్డి, ప్రవీణ్, 'షకలక' శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: సుమిత్ పటేల్ ఓదెల, కూర్పు: ఆర్కే - అఖిల్ బలరామ్, సౌండ్ డిజైనర్: శ్రీను నాగపురి, కొరియోగ్రఫీ: బాబీ మాస్టర్, స్టంట్స్: కృష్ణ మాస్టర్.