Tamil Actor Vishal Sensational Comments About National Awards: తనకు నేషనల్ అవార్డ్స్‌పై ఇంట్రెస్ట్ లేదని... ఒకవేళ వచ్చినా వాటిని డస్ట్ బిన్‌లో వేసేస్తానని కోలీవుడ్ స్టార్ విశాల్ అన్నారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో తన కెరీర్, నేషనల్ అవార్డ్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. జాతీయ అవార్డులపై సంచలన కామెంట్స్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
8 మంది ఎలా డిసైడ్ చేస్తారు?
'యువర్స్ ఫ్రాంక్లీ విశాల్' పాడ్ కాస్ట్‌లో విశాల్ ఈ కామెంట్స్ చేశారు. 'నేషనల్ అవార్డులు సహా నేను ఏ పురస్కారాలను కూడా నమ్మను. మనం ఏంటి, మన యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. 8 కోట్ల మంది డిసైడ్ చేయాల్సింది జ్యూరీగా ఉండే ఏడెనిమిది మంది బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీ అంటూ ఎలా డిసైడ్ చేస్తారు? ఓ సర్వే కండక్ట్ చేసి ప్రేక్షకుల ఒపీనియన్ తెలుసుకోవాలి. అలా చేయడమే ఇంపార్టెంట్. నాకు అవార్డు రాలేదనే ఉద్దేశంతో ఇలా చెప్పడం లేదు.
నిజమైన గుర్తింపు అనేది ప్రేక్షకుల నుంచి మాత్రమే వస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో నాకు ఏదైనా అవార్డ్ వచ్చినా నేను ఇదే మాటకు కట్టుబడి ఉంటాను. నాకు ఏదైనా నేషనల్ అవార్డు వచ్చినా దాన్ని డస్ట్ బిన్‌లో వేస్తా. ఒకవేళ అది బంగారంతో తయారు చేయిందిందైతే... దాన్ని అమ్మేసి, వచ్చిన డబ్బులను ఛారిటీకి విరాళంగా ఇచ్చేస్తాను.' అని చెప్పారు.
Also Read: మెగాస్టార్‌తో సూపర్ స్టార్ విత్ రెబల్ స్టార్ - ఈ బెస్ట్ మూమెంట్ ఎప్పటిదో తెలుసా?
ఆ రోల్ మళ్లీ చేయను
తనకు కోట్లు ఆఫర్ చేసినా 'అవన్ ఇవన్' సినిమాలో చేసిన పాత్ర మళ్లీ చేయనని చెప్పారు విశాల్. తెలుగులో ఈ మూవీ వాడు వీడుగా రీమేక్ చేశారు. ఆ రోల్ కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమపడినట్లు తెలిపారు. ఈ మూవీలో మరో హీరో ఆర్య కాగా... బాలా తెరకెక్కించారు. ఇక సినిమాల్లో ఎంత కష్టమైన స్టంట్స్ అయినా తానే చేస్తానని అన్నారు. 'స్టంట్స్ డూప్‌తో చేయించడం నాకు ఇష్టం ఉండదు. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసే క్రమంలో డూప్ లేకుండానే చేస్తాను. అలాంటి సందర్భాల్లో నాకు తగిలిన గాయాలతో నాకు 119 కుట్లు పడ్డాయి.' అని వెల్లడించారు.
రీసెంట్‌గా మదగజరాజ మూవీతో బిగ్ సక్సెస్ అందుకున్న ఆయన ప్రస్తుతం 'తుప్పరివాలన్ 2' (డిటెక్టివ్ 2)తో పాటు 'మకుటం' మూవీస్ చేస్తున్నారు. ఈ మూవీకి రవి అరసు దర్శకత్వం వహిస్తుండగా... దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాల్ కెరీర్‌లో ఇది 35వ సినిమా. ఆ తర్వాత సుందర్ సి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.