Epic Throwback Photo Of Megastar Chiranjeevi Prabhas Maheshbabu: మెగాస్టార్ చిరంజీవితో సూపర్ స్టార్, పాన్ ఇండియా స్టార్, యంగ్ హీరోస్ సందడి చేసిన ఫోటో వైరల్ అవుతోంది. చిరుతో పాటు సీనియర్ హీరో శ్రీకాంత్, ప్రభాస్, మహేష్ బాబు, సుమంత్, లవర్ బాయ్ తరుణ్ ఉన్న పాత ఫోటో వైరల్ అవుతోంది. టాలీవుడ్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ ఈ బెస్ట్ మూమెంట్‌ను షేర్ చేశారు.
ఈ మూమెంట్ ఎక్కడంటే?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను పంచుకునే డైరెక్టర్ జయంత్ పరాన్జీ తాజాగా మెగాస్టార్‌తో యంగ్ హీరోస్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ పిక్ 2004లో తన బర్త్ డే వేడుకల టైంలో తీసుకున్న ఫోటో అంటూ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ బెస్ట్ మూమెంట్ వైరల్ అవుతుండగా... మెగా ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం హీరోస్ అందరితో కలిసి బర్త్ డే మూమెంట్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: 50 కోట్లకు చేరువలో 'డ్యూడ్' - వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ 2 డేస్ కలెక్షన్స్ కుమ్మేశాయంతే...
డైరెక్టర్ జయంత్ పరాన్జీ ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ అందించారు. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా?, ప్రేమంటే ఇదేరా, రావోయి చందమామ, టక్కరి దొంగ, ఈశ్వర్, లక్ష్మీ నరసింహ, శంకర్ దాదా ఎంబీబీఎస్, సఖియా, అల్లరి పిడుగు, తీన్మార్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.