Kiran Abbavaram's K Ramp Day 1 Worldwide Box Office Collections: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కె ర్యాంప్' శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నట్లు మూవీ టీం హర్షం వ్యక్తం చేసింది. తాజాగా అఫీషియల్ తొలి రోజు కలెక్షన్స్ అనౌన్స్ చేశారు మేకర్స్.

Continues below advertisement

ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

'కె ర్యాంప్' ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం వెల్లడించింది. 'బాక్సాఫీస్ దగ్గర తన మాస్ మ్యాడ్‌నెస్ చూపించిన కుమార్ అబ్బవరం.' అంటూ అఫీషియల్‌గా ఓ స్పెషల్ పోస్టర్ పంచుకుంది. ఇక ఇండియావ్యాప్తంగా ఓపెనింగ్ డే రూ.2.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.1.4 కోట్ల నుంచి రూ.1.6 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్నిల్క్ నివేదిక తెలిపింది. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ ఆక్యుపెన్సీ 37.10 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Continues below advertisement

Also Read: 'బాహుబలి' నిర్మాతలతో 'పుష్ప' విలన్ మూవీ - బాలయ్య ఫేమస్ డైలాగ్‌ టైటిల్‌తో... హీరోగా తెలుగు డెబ్యూ

ఈ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహించగా... కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ హీరో నరేష్, కమెడియన్ వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, అమృతం ఫేం నారిపెద్ది శివన్నారాయణ, అలీ కీలక పాత్రలు పోషించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించగా... చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో అందరూ మూవీని ఎంజాయ్ చేస్తున్నారని... ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మూవీ టీం థాంక్స్ చెప్పింది.