సక్సెస్ ట్రాక్‌లో ఉన్న హీరోలకు డిస్ట్రిబ్యూషన్ వర్గాలు అయినా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అయినా రెడ్ కార్పెట్ వేస్తాయని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. 'హను - మాన్'తో తేజా సజ్జా పాన్ ఇండియా సక్సెస్ కొట్టాడు. అది ఫ్లూక్ కాదని, తనకు విజయం రావడం వెనుక తన కృషి - కథల ఎంపిక ఉందని 'మిరాయ్'తో మరోసారి ప్రూవ్ చేశాడు. అదీ పాన్ ఇండియా హిట్ అయ్యింది. దాంతో అతని నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళకముందు ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యిందని టాక్.
'జాంబీ రెడ్డి 2' ఓటీటీ @ 40 కోట్లు!
Zombie Reddy OTT Deal Price: 'హను - మాన్' కంటే ముందు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మతో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తేజా సజ్జా చేసిన సినిమా 'జాంబీ రెడ్డి'. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్ చేయడానికి తేజా సజ్జాతో పాటు ప్రశాంత్ వర్మ రెడీ అవుతున్నారు. ఇంకా సెట్స్ మీదకు మూవీ వెళ్ళలేదు. అయితే ఓటీటీ సంస్థలు రైట్స్ సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ 'ఓజీ' దర్శక నిర్మాతల మధ్య గొడవలు - క్లారిటీ ఇచ్చిన సుజీత్!
'జాంబీ రెడ్డి 2' షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఆ మాటకు వస్తే ఇంకా సినిమాకు పూజ కూడా చేయలేదు. కానీ ఆ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 40 కోట్లు ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చాయి. ఆల్మోస్ట్ డీల్ క్లోజ్ అయినట్టే. తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ కలయికలో 'హను - మాన్' వచ్చి ఉండటం, దానికి తోడు 'మిరాయ్' సక్సెస్ కావడం వల్ల ఈ క్రేజ్ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
రెమ్యూనరేషన్ కూడా పెరిగింది!
Teja Sajja Remuneration For Zombie Reddy 2: 'హను - మాన్', 'మిరాయ్' సక్సెస్ తర్వాత తేజా సజ్జా రెమ్యూనరేషన్ సైతం పెరిగిందని టాక్. ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకు పది కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారట. అందుకని 'జాంబీ రెడ్డి' సినిమా చేతులు మారింది. మొదట అనుకున్న నిర్మాత కాకుండా ఇప్పుడీ సినిమాను 'మిరాయ్' ప్రొడ్యూస్ చేసిన పీపుల మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాకు తేజా సజ్జా 12 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట.