Venkatesh Trivikram Movie Title Locked : సిల్వర్ స్క్రీన్‌పై విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూవీ అంటేనే క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ రెడీ కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ టైటిల్‌పై ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది.

Continues below advertisement


క్రేజీ టైటిల్...


త్రివిక్రమ్, వెంకీ మూవీ అంటేనే మనకు ఫన్‌తో పాటు ఎమోషన్, అనుబంధాలు ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లుగానే క్లీన్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ టైటిల్‌నే ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు 'బంధుమిత్రుల అభినందనలతో' అనే టైటిల్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం టైటిల్‌తోనే టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచేస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం 'Venky77' వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతుండగా త్వరలోనే అఫీషియల్‌గా పేరు అనౌన్స్ చేస్తారని సమాచారం.


Also Read : వేణు 'ఎల్లమ్మ'పై వీడిన సస్పెన్స్ - ఎట్టకేలకు సైలెన్స్ బ్రేక్ చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు


వెంకీ, త్రివిక్రమ్ కాంబో అంటే ఫ్యాన్స్‌కు పండుగే. అంతకు ముందు వాసు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీకి డైరెక్షన్ చేస్తుండడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారు. ఇటీవలే ఆమెకు మూవీ టీం గ్రాండ్ వెల్ కం చెప్పింది. వెంకీ కెరీర్‌లో ఇది 77వ సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఫేమస్ ప్రొడ్యూసర్ సూర్యదేవర రాధాకృష్ణ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ప్రస్తుతం వెంకీ... మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీలో స్పెషల్ రోల్ చేస్తున్నారు.