తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శక - రచయిత, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'వాసు', 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలకు రచయితగా పని చేసిన గురూజీ... దర్శకుడిగా వెంకీతో చేస్తున్న మొదటి చిత్రమిది. ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'ఏకే 47' - యాక్షన్ హింట్ ఒక్కటే కాదు...ఇది 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47'Venkatesh 77th Movie Titled Aadarsha Kutumbam House No 47 Movie: వెంకీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' టైటిల్ ఖరారు చేశారు. షార్ట్ కట్‌లో 'ఏకే 47' అని పేర్కొన్నారు. ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు సినిమాలో వెంకటేష్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' సినిమాను శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేష్ 77వ చిత్రమిది.
షూటింగ్ మొదలు... వేసవిలో విడుదల!'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 - ఏకే 47' చిత్రీకరణ మొదలు పెట్టామని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేశారన్నమాట.
'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 - ఏకే 47' సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఇంతకు ముందు కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'కేజీఎఫ్', నాని 'హిట్ 3', సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' సినిమాల్లో ఆమె నటించారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.