Dhurandhar worldwide box office collection: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇదంతా సంఖ్యాశాస్త్రం వల్ల కలిసొచ్చిన అదృష్టం అంటున్నారు నిపుణులు. న్యూమరాలజీ ప్రకారం రణవీర్ సింగ్ నంబర్ 6. ఈ నంబర్ కి అధిపతి శుక్రుడు. ఇది కళలు, సౌందర్యం, వినోదం, ఆకర్షణకు ప్రాతినిథ్యం వహించే గ్రహం. అందుకే రణవీర్ కెరీర్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. హీరోగా నటించినా, నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసినా ఆ నటనకు ఫిదా కాని ప్రేక్షకులు ఉండరు. రీసెంట్ గా దురంధర్ మూవీతో మరో సక్సెస్ అందుకున్నాడు రణ వీర్ సింగ్. సంఖ్యాశాస్త్రం ప్రకారం తన నంబర్ 6 అవడం కూడా సక్సెస్ కి చేరువ చేసిందన్నది జ్యోతిష్య శాస్త్ర పండితుల మాట.

Continues below advertisement

శుక్రుడు  ప్రత్యేక గుర్తింపును ఇస్తాడు

శుక్రుడు కళ , ప్రదర్శన వంటి రంగాలలో ఉన్న వ్యక్తులకు ప్రత్యేకమైన సృజనాత్మకతను ఇస్తాడు. రణవీర్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ రణవీర్ ను ప్రత్యేకంగా చూపినవే. విభిన్నమైన పాత్రల ఎంచుకోవడమే కాదు అందులో ఒదిగిపోయి నటిస్తాడనే ప్రశంసలు అందుకున్నాడు. దురంధర్ కూడా అలాంటి మూవీగానే నిలిచింది. ఈ సినిమాలో రణవీర్ లుక్ , నటన చాలా కొత్తగా ఉంటుంది.  న్యూమరాలజీ ప్రకారం రణవీర్ నంబర్ 6 సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 ఉన్నవారు కళకు సంబంధించిన విషయాల్లో భావోద్వేగంగా కనెక్ట్ అయిపోతారు. గత చిత్రాలు మాత్రమే కాదు ధురంధర్ సినిమాలోనూ రణవీర్ నటన చూస్తే ఇది స్పష్టమవుతుంది . శుక్రుని ప్రభావం తనని ఆకర్షణీయంగా మార్చడమే కాదు ప్రేక్షకులను కట్టిపడేసే సామర్థ్యాన్నిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం ఇదే నంబర్ కి చెందిన నటులు ఇంకా...షారుఖ్ ఖాన్ (6), ఐశ్వర్య రాయ్ (6), మాధురి దీక్షిత్ (6), కరీనా కపూర్ (6)..ఇంకా లిస్ట్ పెద్దగానే ఉంది. వీరంతా కళారంగంలో రాణించినవారే

Continues below advertisement

ధురంధర్ సక్సెస్ రణవీర్ కెరీర్లో మైలురాయి ధురంధర్‌ సినిమా రణవీర్ కెరీర్లో మైలురాయి అవుతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర, సంఖ్యాశాస్త్ర నిపుణులు. నంబర్ 6 + మాస్టర్ 33 వైబ్రేషన్ + ప్రసన్న శుక్రుడు + పీక్ ఏజ్ – ఇవన్నీ కలిస్తే ఇది కేవలం హిట్ కాదు, ఒక హిస్టారికల్ బ్లాక్‌బస్టర్ + ఆస్కార్ లెవెల్ పర్‌ఫార్మెన్స్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. రణవీర్ సింగ్ ఇప్పటివరకు చేసిన  సినిమాల కన్నా ఎక్కువ గుర్తింపు, డబ్బు, ఫేమ్ ఇవన్నీ ధురంధర్ అందిస్తుందని  న్యూమరాలజీ చాలా క్లియర్‌గా చెబుతోంది.  ఈ నంబర్ 6 వల్లే అద్భుతంగా రాణిస్తున్నాడని..భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకుంటాడని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు

 2025 డిసెంబర్ 5న విడుదలైన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్  ధురంధర్ (Dhurandhar). రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో భారత ఇంటెలిజెన్స్ ఏజెంట్‌ల రియల్-లైఫ్ ఆపరేషన్స్ ఆధారంగా తెరకెక్కింది. మూవీ రన్ టైమ్ 3 గంటల 34 నిమిషాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు దాన్ని గ్రిప్పింగ్‌గా ప్రశంసించారు. విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్ల నెట్ మార్క్‌ను దాటింది మూవీ. ప్రపంచవ్యాప్తంగా  160 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ సినిమాలో రణవీర్ నటన చూసి..పైనల్లీ హి ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు. 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఆయా  ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.