మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). ఇందులో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రత్యేక పాత్రను సందడి చేయనున్నారు. చిరు సినిమాకు ముందు వెంకీ హీరోగా 'సంక్రాంతికి వస్తున్నాం'తో భారీ విజయం అందుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. దానికి ముందు ఆయన హీరోగా 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' వంటి కమర్షియల్ సక్సెస్‌లు తీశారు. చిరు - వెంకీ మధ్య స్నేహం ఉండటం, అలాగే దర్శకుడితో మంచి అనుబంధం కారణంగా 'మన శంకర వర ప్రసాద్' సినిమాలో ప్రత్యేక పాత్ర చేయడానికి వెంకీ ఓకే చెప్పారు. మరి ఆ సినిమా చిత్రీకరణలో ఎప్పటి నుంచి పాల్గొంటారో తెలుసా?
అక్టోబర్ నుంచి చిరు సెట్స్‌కు వెంకటేష్!చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇటీవల 'మన శంకర వర ప్రసాద్ గారు' టైటిల్ విడుదల చేశారు. సినిమా పేరును వెంకీ వాయిస్ ద్వారా పరిచయం చేశారు. ఆల్రెడీ వెంకటేష్ షూటింగ్ స్టార్ట్ చేశారా? అంటే... 'లేదు' అని చెప్పాలి. మరి ఎప్పటి నుంచి షూటింగ్ మొదలు పెడతారు? అంటే అక్టోబర్ నెల నుంచి చిత్రీకరణలో వెంకీ గారి జాయిన్ అవుతారని 'కిష్కిందపురి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ అధినేత సాహు గారపాటి తెలిపారు. చిరు సినిమా నిర్మాతలలో ఆయన ఒకరు.
సెప్టెంబర్ 5 నుంచి కొత్త షెడ్యూల్ షురూ!'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రీకరణ కొంత పూర్తి అయ్యింది. ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ కంప్లీట్ చేశారని టాక్. హైదరాబాద్‌తో పాటు డెహ్రాడూన్ సిటీ, కేరళ రాష్ట్రంలో కొంత చిత్రీకరణ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి హైదరాబాద్‌లో సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు.
చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలో కేథరిన్ త్రెసా, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ సాహు గారపాటితో పాటు చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: నాగార్జున పెద్ద కోడలు అంటే నమ్మగలమా? నాగచైతన్య భార్య ఎంత సింపుల్‌గా వంట చేసిందో ఫోటోల్లో చూడండి