కన్ను గీటి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసేసి ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ . 2019లో వచ్చిన ఒరు ఆదార్ లవ్ మూవీతో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ మాలీవుడ్ సోయగం. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది అనుకుంటే సపోర్టింగ్ రోల్స్ కే పరిమితమైంది. లేటెస్ట్ గా ఆమె ఓ మూవీలో మెరిసి అభిమానులకు షాక్ ఇచ్చింది.సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ నటించిన తుషార్ జలోటా మూవీ పరమ్ సుందరిలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ప్రియా ప్రకాష్ వారియర్య.. ఎరుపు తెలుపు రంగు చీరలో సిద్ధార్థ్ వెనుక గుంపులో నడుస్తున్నట్లు కనిపించింది. ఈ ఫ్రేమ్ లో ప్రియా కనిపించడం అభిమానులను పెద్ద షాక్ ఇచ్చింది. హీరోయిన్ గా వెలగాల్సిన నటి ఇలా ఎందుకు నటించిందని ఆశ్చర్యపోతున్నారంతా.
పరమ్సుందరిలో ప్రియా కనిపించిన ఈ క్లిప్ Instagram, X , Reddit లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయ్. "ఓ మలయాళ నటిని కేరళ ఆధారిత బాలీవుడ్ మూవీలో సాధారణ పాత్రలో తీసుకోవడం జాతి వివక్షత కాదా?" అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ఆమె క్యారెక్టర్ ని ఎడిటింగ్ సమయంలో తగ్గించి ఉండవచ్చని మరో నెటిజన్ పోస్ట్ పెట్టారు. సినిమా షూటింగ్ ఓ లెక్క..ఎడిటింగ్ మరో లెక్క...ఆ టైమ్ లో చాలా సన్నివేశాలకు కత్తెర పడుతుంది..ఇది కామన్ అని మరో నెటిజన్ అన్నారు. అయితే జాన్వికపూర్ క్యారెక్టర్లో ప్రియా ప్రకాష్ వారియర్ నటించి ఉంటే బావుండేదని మరొకరు పోస్ట్ పెట్టారు.
ఓరు ఆదార్ లవ్ తో నటన ప్రారంభించిన ప్రియా...కన్ను గీటిన సన్నివేశంతో నేషనల్ లెవెల్లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం మూవీస్ లో ఆఫర్స్ అందుకుంది. హిందీ సినిమాల్లోనూ నటించింది. 2023లో యారియాన్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా అజిత్ కుమార్ తమిళ యాక్షన్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలో మెరిసింది.
వాస్తవానికి ఇండస్ట్రీలో ఎంత ఫేమ్ వచ్చినా కాస్త అదృష్టం కూడా కలసిరావాలి. ప్రియాకు అవకాశాలు వచ్చినా అదృష్టం కలసిరాలేదు. ఆమె తెలుగులో నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. మలయాళం, హిందీ, తెలుగు...ఈ మూడు భాషల్లో నటించిన సినిమాలన్నీ కూడా నెగెటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ చేరింది. అయినప్పటికీ ఆఫర్లకు కొదవేం లేదు. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయి. 3 మంకీస్, లవ్ హ్యాకర్స్ అనే 2 హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఏదేమైనా పరమ్ సుందరిలో ఇలా ఓ ఫ్రేమ్ లో కనిపించి మాయమవడం బాలేదంటున్నారు అభిమానులు. మరి దీనిపై ప్రియా ఏమంటుందో...!