'బాహుబలి' (Baahubali)తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది. భారీ స్పాన్ ఉన్న కథలను రెండు భాగాలుగా విడుదల చేయడం ఆ సినిమాతో స్టార్ట్ అయ్యింది. అంతకు ముందు సీక్వెల్స్ ఉన్నాయ్. అయితే ఒక్క సినిమాగా స్టార్ట్ చేసిన కథను రెండున్నర లేదా మూడు గంటల్లో చెప్పలేక రెండు భాగాలుగా విడుదల చేసి భారీ విజయాలు సాధించవచ్చని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) చూపించారు. ఆ తర్వాత 'కేజీఎఫ్', 'పొన్నియన్ సెల్వన్' వంటివి వచ్చాయి. 'కల్కి 2898 ఏడీ', 'సలార్' సీక్వెల్స్ రావాల్సి ఉంది. ఇప్పుడు ఆ రూటులో రాజమౌళి మరోసారి ట్రావెల్ చేసేందుకు రెడీగా ఉన్నారట.

రెండు పార్టులుగా SSMB29 విడుదలసూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter) సినిమా చేస్తున్నారు. హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రీ లుక్ విడుదల చేశారు. నవంబరులో ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ / సీక్రెట్ రివీల్ అయ్యింది. 

SSMB29 షూటింగ్ కోసం టీంతో కలిసి రాజమౌళి కెన్యా వెళ్లారు. అక్కడ ప్రభుత్వ పెద్దలను కలిశారు. క్యాబినెట్ సెక్రటరీ అయితే రాజమౌళితో దిగిన ఫోటోలు షేర్ చేసి... 120 దేశాల్లో మూవీ రిలీజ్ అవుతుందని పేర్కొన్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రెండు పార్టులుగా మహేష్ - రాజమౌళి సినిమా రూపొందుతోందని కెన్యా మీడియా పేర్కొంది.

Also Read: సెట్‌లో వంట చేసిన అక్కినేని కోడలు... కామెంట్ చేసిన నాగ చైతన్య - ఏమన్నారో చూశారా?

ఆఫ్రికా నేపథ్యంలో మహేష్ - రాజమౌళి సినిమా కొంత సాగుతుంది. ఆ సన్నివేశాలు అన్నిటినీ తమ దేశంలో షూటింగ్ చేస్తున్నారని కెన్యా ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. అక్కడ గవర్నమెంట్ నుంచి మీడియాకు లీకులు ఇచ్చినట్టు ఉన్నారు. మహేష్ సినిమా రెండు పార్టులు అని పేర్కొంది. అలా చేస్తే మరోసారి 'బాహుబలి' రూటులో రాజమౌళి వెళ్ళినట్టే. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా పార్ట్ 2 అనౌన్స్ చేయలేదు. కానీ, ఆ సినిమా సీక్వెల్ చేసే ఛాన్సులు ఉన్నాయని హింట్స్ వచ్చాయి. మరి మహేష్ సినిమా గురించి రాజమౌళి ఎప్పుడు రివీల్ చేస్తారో? ఆయన సీక్రెట్ కెన్యాలో రివీల్ అయ్యింది.

Also Read'కిష్కిందపురి' ట్రైలర్ రివ్యూ... దెయ్యంలా అనుపమ... భారమంతా బెల్లంకొండ మీదే!

మహేష్ బాబుతో పాటు రాజమౌళి సినిమాలో గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ స్టార్ ఆర్ మాధవన్ నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.