Sankranthiki Vasthunam Success Mantra : ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందనే గుడ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కానీ ఊహించని విధంగా 'సంక్రాంతి వస్తున్నాం' మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడానికి కారణం ఓ సెంటిమెంట్ అనే విషయం తెలుసా? 25 ఏళ్ళ క్రితం తనకు కలిసి వచ్చిన అదే రోజున 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ విడుదలతో వెంకీ మామ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
5 రోజుల్లోనే 150 కోట్లకు పైగా కలెక్షన్స్...
అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. 'డాకు మహారాజ్', 'గేమ్ ఛేంజర్' లాంటి భారీ సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. కేవలం రిలీజ్ అయిన 5 రోజుల్లోనే ఈ సినిమా రూ. 161 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి పొంగల్ హిట్ గా నిలిచింది. ఒకవేళ ఈ మూవీ ఇదే జోరు కంటిన్యూ చేస్తే మరికొన్ని రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లో చేరినా షాక్ అవ్వక్కర్లేదు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నిర్మాత దిల్ రాజు కూడా 'ఇదో అద్భుతం' అంటూ మూవీ సక్సెస్ పై ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేశారు.
వర్కౌట్ అయిన సెంటిమెంట్...
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడం వెనక రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఆ సెంటిమెంట్ ఏంటంటే... సరిగ్గా 25 ఏళ్ల క్రితం వెంకీ మామ 'కలిసుందాం రా' సినిమాతో తన కెరీర్లో ఓ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. 2000 జనవరి 14న రిలీజ్ అయిన 'కలిసుందాం రా' మూవీ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మళ్లీ అదే రోజున అంటే 2025 జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ రిలీజై, మరోసారి సంచలనంగా మారింది. మొత్తానికి 25 ఏళ్ల తర్వాత వెంకీ మామ హిస్టరీని రిపీట్ చేశారు. దీంతో జనవరి 14 అనేది వెంకీ మామ సినీ కెరియర్ లో ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. రెండుసార్లు అదే డేట్ తో వచ్చి హిట్ అందుకున్న వెంకటేష్ కి జనవరి 14 బాగా కలిసి వచ్చింది. గత ఏడాది జనవరి 13న రిలీజ్ అయిన వెంకటేష్ 'సైంధవ్' మూవీ డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. మరి 'సంక్రాంతికి వస్తున్నాం' టీం యాదృచ్ఛికంగా ఈ డేట్ ను ఫిక్స్ చేసిందా? లేదంటే సెంటిమెంట్ గా భావించిందో తెలియదు. కానీ జనవరి 14 అనేది ఆయనకు బాగా కలిసి వచ్చిన డేట్ అనేది ఒప్పుకొని తీరాల్సిన విషయం.
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ కూడా...
తాజాగా సుమతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు 'సంక్రాంతికి వస్తున్నాం' టీం. అందులో భాగంగా ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. "సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ ఉంటుందా?" అని సుమా అడగ్గా... అనిల్ రావిపూడి స్పందిస్తూ "ఆ విషయం సీక్వెల్ లో తెలుస్తుంది" అంటూ సీక్వెల్ పై హింట్ ఇచ్చారు. పైగా ఇదే టైటిల్ తో మళ్ళీ వచ్చే సంక్రాంతికి మూవీ వచ్చే అవకాశం ఉందని ఆయన ఇన్ డైరెక్టుగా వెల్లడించారు.
Also Read : బాక్సాఫీసు వద్ద వెంకీమామ దూకుడు - షాకిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' 5 రోజుల కలెక్షన్స్, ఎంతంటే!