చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... ఒక జనరేషన్ స్టార్ హీరోలు. సుమారు మూడు నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న కథానాయకులు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు నాగ చైతన్య - అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ రెడీ అయింది. మరి వెంకటేష్ వారసుడి సంగతి ఏంటి? తాజా ఇంటర్వ్యూలో వెంకీ మామ ఆ విషయం గురించి స్పందించారు.
వెంకీ మామ వారసుడు సినిమాల్లోకి వస్తాడు!
కాంటెంపరరీ హీరోల పిల్లలతో పోలిస్తే వెంకటేష్ కుమారుడి వయసు చాలా తక్కువ. ముగ్గురు అమ్మాయిల తర్వాత అబ్బాయి పుట్టాడు వెంకీ మామకు. ఆ కుర్రాడి పేరు అర్జున్ దగ్గుబాటి. మిగతా స్టార్ హీరోల కుమారులు వారసులతో పోలిస్తే మీడియాలో అతను కనిపించేది చాలా తక్కువ. పిల్లాడు చిన్నోడు కావడంతో సినిమాల్లోకి రావడానికి సమయం ఉందని అభిమానులు కూడా డిసైడ్ అయ్యారు. అయితే వాళ్లందరికీ వెంకటేష్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు.
తన కుమారుడు అర్జున్ సినిమాల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాడు అని, ప్రస్తుతం నటనకు సంబంధించిన విషయాలలో శిక్షణ తీసుకుంటున్నాడు అని, త్వరలో సినిమాల్లోకి వస్తాడు అని వెంకటేష్ చెప్పారు. సంక్రాంతి పండక్కి ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ సీజన్ 4' కార్యక్రమానికి వెంకీ మామ విచ్చేశారు. అందులో వారసుడి తెరంగేట్రం గురించి చెప్పుకొచ్చారు.
వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
ఇండస్ట్రీలో అజాత శత్రువు ఎవరు? అంటే వెంకటేష్ పేరు చెప్పవచ్చు. ఆ విషయంలో ప్రేక్షకులకు గాని, అభిమానులకు గాని ఎటువంటి సందేహాలు అవసరం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున... ముగ్గురితో ఆయన ఎంత సరదాగా ఉంటారో... 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' సినిమాలలో నటించిన వరుణ్ తేజ్ వంటి యంగ్ హీరోలతో సైతం అంతే సరదాగా ఉంటారు వెంకటేష్. మరి ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? తన వైఫ్ నీరజ తన బెస్ట్ ఫ్రెండ్ 'అన్ స్టాపబుల్' షోలో బాలకృష్ణతో చెప్పారు.
Also Read: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విషయానికి వస్తే... వెంకటేష్ జోడిగా, హీరో భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు. మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి సైతం ఈ సినిమాలో ఉన్నారు. హీరో మాజీ ప్రేయసి పాత్రలో ఆ అమ్మాయి సందడి చేయనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.
Also Read: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?