గ్లామరస్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ మూవీ భూమరాంగ్. పలు భాషల్లో ఇప్పటిదాకా 34 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మై3 మూవీ ఆర్ట్స్ పతాకాలపై లండన్ గణేష్, ప్రవీణ్ రెడ్డి ఊట్ల ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
'బూమరాంగ్' ఫస్ట్ లుక్ రిలీజ్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా 'బూమరాంగ్' మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన 'బూమరాంగ్' మూవీ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉందని అన్నారు. అలాగే మూవీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇక ఫస్ట్ లుక్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ తో వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంది. అను ఇమ్మాన్యుయేల్ ఫేస్ లో భయంతో పాటు షాక్ కనిపిస్తుండగా, ఆమె నుదుటిపై ఉన్న రక్తం, పక్కనే పోస్టర్లో ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నట్లుగా కనిపించడం, ఆ ఇల్లు... మంచి హర్రర్ ఫీల్ ని తెప్పిస్తున్నాయి. ఇక ఈ మూవీని లండన్ లోని పలు ప్రదేశాల్లో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఫస్ట్ టైం హారర్ జానర్ లో అను
ఇప్పటిదాకా అను ఇమ్మాన్యుయేల్ గ్లామరస్ పాత్రలు మాత్రమే పోషించింది. అయితే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం త్వరగానే ఈ అమ్మడిని వరించింది. కానీ అదృష్టం మాత్రం కలిసి రాకపోవడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోయింది. తాజాగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ ని చూస్తుంటే ఫస్ట్ టైం అను ఇమ్మాన్యు యేల్ హర్రర్ జానర్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉందనిపిస్తోంది. మరి ఈ సినిమా అయినా ఆమెకు లక్ తీసుకొస్తుందా? అను 'బూమరాంగ్' ద్వారా ప్రేక్షకులను భయపెట్టగలదా? అనేది చూడాలి.
సంక్రాంతికి వెంకటేష్ సందడి
ఇక ఈసారి సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతి వస్తున్నాం' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా... మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, మూవీ రిలీజ్ గురించి వెంకీ మామ అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా జనవరి 14న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. గత ఏడాది 'సైంధవ్' సినిమాతో నిరాశ పరిచిన వెంకటేష్ ఈసారి మాత్రం హిట్ కొట్టడం పక్కా అన్న కాన్ఫిడెంట్ తో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఎగ్జైటింగ్ గా ఉన్నారు.