Venkatesh New Look From Chiranjeevi Mana Shankara Varaprasad Garu Movie : మెగాస్టార్ చిరు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బర్త్ డే సందర్భంగా మూవీ టీం స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
పోస్టర్ రిలీజ్
మూవీలో వెంకీ లుక్ రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. హెలికాఫ్టర్, భారీ దిగుతూ ఛార్మింగ్ అండ్ డాషింగ్ లుక్‌లో వెంకీ పోస్టర్ అదిరిపోయింది. గత మూవీస్ కంటే డిఫరెంట్‌గా ఉన్న లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మల్టీ స్టారర్ మూవీలో వెంకీ రోల్ ఏమై ఉంటుందా? అనే సస్పెన్స్ నెలకొంది. 'ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ - విక్టరీ వెంకటేష్. హ్యపీ బర్త్ డే వెంకటేష్ గారు.' అంటూ మూవీ టీం ఆయనకు స్పెషల్ విషెష్ చెప్పింది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి చిరు వింటేజ్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. 'మీసాల పిల్ల' సాంగ్ 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించింది. సినిమాలో చిరు, వెంకీ రోల్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
ఈ మూవీలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. రెండు సాంగ్స్‌లోనూ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిరు, నయన్, వెంకటేష్‌లతో పాటు వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంట్రటైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.