Balakrishna's Akhanda 2 Day 1 Box Office Collection : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బోయపాటి డివోషనల్ సోషల్ డ్రామా 'అఖండ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. బాలీవుడ్ మూవీ 'ధురంధర్' ఫస్ట్ డే కలెక్షన్లనే బీట్ చేస్తూ రికార్డు సృష్టించింది.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' వరల్డ్ వైడ్‌గా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం అఫీషియల్‌గా వెల్లడించింది. ప్రీమియర్లతో కలిపే ఈ వసూళ్లు సాధించినట్లు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. బాలయ్య కెరీర్‌లోనే ఫస్ట్ డే ఈ స్థాయిలో వసూలు చేసిన తొలి మూవీ ఇదేనని తెలిపింది. కేవలం ప్రీమియర్స్ ద్వారానే రూ.10 కోట్లు వచ్చినట్లు నిర్మాత రామ్ అచంట తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ ప్రీమియర్స్ వేశారు.
ఇక ఇండియావ్యాప్తంగా రూ.22.53 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా... తెలుగు నుంచి రూ.21.95 కోట్లు, హిందీ ద్వారా రూ.11 లక్షలు వచ్చాయి. ఇప్పటివరకూ ఇండియాలో రూ.30.53 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ కలుపుకొని రూ.59.5 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ధురంధర్‌ను మించి
ఇక రీసెంట్‌గా వచ్చిన బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'నే 'అఖండ 2' బీట్ చేసింది. ఈ మూవీ ఫస్ట్ డే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు చేరువలో ఉండగా... 'అఖండ 2' కూడా వారం రోజుల్లోనే అంతే స్థాయి కలెక్షన్స్ సాధించడం కన్ఫర్మ్ అంటూ బాలయ్య ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రికార్డు కలెక్షన్స్‌పై మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది.
Also Read : రోషన్ కనకాల 'మోగ్లీ' ఓటీటీ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
టీం సెలబ్రేషన్స్
'అఖండ 2' ఘన విజయం సాధించడంతో మూవీ టీం పండుగ చేసుకుంటోంది. ఇది మూవీ కాదని... భారతదేశ ఆత్మ అని అన్నారు డైరెక్టర్ బోయపాటి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో పాటు ఆయన కేక్ కట్ చేశారు. ఇంతటి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. లాజిక్ లేదంటూ వస్తోన్న విమర్శలకు డైరెక్టర్ బోయపాటి స్పందించారు. 'అఖండ' ఓ సూపర్ మ్యాన్ అని... విశ్వరూపం చూపించగలరని... దీనికి లాజిక్, మ్యాజిక్ అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో భారీగా విజయోత్సవ సభలు నిర్వహిస్తామని నిర్మాతలు వెల్లడించారు.