NTR Prashanth Neel Movie Shooting Updates : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ బిగ్గెస్ట్ పీరియాడికల్ డ్రామా షూటింగ్ మళ్లీ ప్రారంభం అయ్యింది.

Continues below advertisement

3 వీక్స్... న్యూ షెడ్యూల్

సుదీర్ఘ విరామం తర్వాత ఎన్టీఆర్ నీల్ 'డ్రాగన్' మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. తారక్‌తో పాటు కీలక యాక్టర్స్‌పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 3 వారాలు ఈ షెడ్యూల్ కంటిన్యూ కానున్నట్లు మూవీ టీం వెల్లడించింది. స్వయంగా ఎన్టీఆరే బాడీ డబుల్ లేకుండా స్టంట్స్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో రెండు డిఫరెంట్ లుక్స్‌లో ఎన్టీఆర్ కనువిందు చేయనున్నారు. ఇప్పటికే మూవీ కోసం బాగా సన్నబడ్డారు. ఇటీవల ఆయన న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

Continues below advertisement

ఇటీవల ఓ యాడ్ షూట్‌లో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడగా విశ్రాంతి తీసుకున్నారు. దీంతో 'డ్రాగన్' షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది. ఈ క్రమంలో పలు రూమర్స్ హల్చల్ చేయగా వాటికి చిత్ర నిర్మాణ సంస్థ ఒక్క ట్వీట్‌తో చెక్ పెట్టింది. తాజాగా మళ్లీ చిత్రీకరణ స్టార్ట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read : ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్

ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ నిర్మిస్తుండగా... రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్ డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ రోల్ కోసం బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌ను అప్రోచ్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది.