Director Boyapati Srinu About Akhanda 2 Negative Reviews : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను 'అఖండ 2' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే, అఘోరగా బాలయ్య యాక్షన్ సీక్వెన్స్‌పై సోషల్ మీడియాలో సాగే ట్రోలింగ్‌పై డైరెక్టర్ బోయపాటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. కొన్ని సీన్లకు లాజిక్కే లేదు అనే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Continues below advertisement

నో లాజిక్... అదే మ్యాజిక్...

సినిమాలో 'అఖండ' పాత్రలో అఘోర అష్ట సిద్ధి సాధించిన వాడని... అష్ట దిగ్బంధనం లోనికి వెళ్లి 12 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి సూపర్ హ్యూమన్‌గా మారిన వ్యక్తి అని బోయపాటి తెలిపారు. 'సూపర్ హీరో. లాజిక్ మ్యాజిక్ అనేది తీసేస్తే సార్. అంతటి గొప్ప వ్యక్తులు తలుచుకుంటే నానో ఆకారానికి వెళ్లగలరు. విశ్వరూపాన్ని కూడా చూపించగలరు. కానీ మేము అంత దూరం వెళ్లలేదు. ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచాం. కేవలం వెపన్‌తో మాత్రమే గేమ్ ఆడాం.

Continues below advertisement

ఓ సూపర్ హీరో ఆ టైమింగ్, సిట్యువేషన్ బట్టి ఏ విధంగా అయినా మారతాడు. సో ఏది చేసినా అతనికి లాజిక్ అనేది అవసరం లేదు. ఎందుకంటే అతను అష్ట సిద్ధి సాధకుడు. ఫస్ట్ రీల్‌లోనే అలా మనం రివీల్ చేశాం. కాబట్టి దీనికి లాజిక్ ఉంది. మేం చెప్పే ప్రారంభించాం.' అంటూ క్లారిటీ ఇచ్చారు.

Also Read : ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్

ఎప్పుడు వచ్చామా అని కాదు?

'అఖండ 2' సినిమా కాదని... భారతదేశ ఆత్మ అని అన్నారు బోయపాటి. 'ఎప్పుడు వచ్చామా అనేది కాదు. సినిమా ప్రేక్షకుల్లోకి చేరిందా? లేదా? అనేదే ఇంపార్టెంట్. ఇది ప్రతీ ప్రేక్షకుడి సినిమా. ఇది మాది అని ఓన్ చేసుకుని ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సనాతన ధర్మం అనే వేదికపై మూవీ తీశాం. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే మంచి సినిమా. ఐమాక్స్‌లో 3D ఎక్స్‌పీరియన్స్ వేరే లెవల్‌లో ఉంటుంది.' అని అన్నారు.

'ఇండస్ట్రీలోనే నెగిటివిటీ'

ఈ సినిమాకు కొందరు సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడంపై నిర్మాతలు స్పందించారు. ఇండస్ట్రీలోనే కాస్త నెగిటివిటీ ఉందని నిర్మాత రామ్ అచంట అభిప్రాయపడ్డారు. 'రివ్యూల విషయంలో ఎవరినీ తప్పు పట్టేందుకు వీలు లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్లు చెప్పారు. గ్రౌండ్ రిపోర్ట్ చాలా బాగుంది. బుకింగ్స్ వేగవంతం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌తో రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం అయ్యాయి. కన్నడలోనూ రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయి. మూవీ రిలీజ్ తర్వాత అందరం ఆనందంగా ఉన్నాం.' అని అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే విజయోత్సవాలు నిర్వహిస్తామని మరో నిర్మాత గోపీ అచంట తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ 800 థియేటర్లలో మూవీ రిలీజ్ చేశామని... అక్కడ కూడా సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. సినిమా విడుదల వారం ఆలస్యం కావడంపై అభిమానులకు సారీ చెప్పారు.