Venkatesh and Varun Tej Movie: తెలుగులో కామెడీ ఫ్రాంచైజ్ సినిమాలు చాలా తక్కువ. అలాంటి వాటిలో ‘ఎఫ్ 2’ కూడా ఒకటి. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజ్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘ఎఫ్ 3’ హిట్ అయిన తర్వాత ఇదే తరహాలో ‘ఎఫ్ 4’ను కూడా తెరకెక్కిస్తానని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్‌ను పక్కన పెట్టి అదే హీరోలతో మరో కొత్త మూవీ ప్లాన్ చేస్తున్నాడట అనిల్. ఇప్పటికే వెంకటేశ్‌కు కథ వినిపించగా.. ఈ సీనియర్ హీరో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇదే మూవీలో వరుణ్ తేజ్ కూడా ఉండబోతున్నట్టు టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఫ్లాప్స్ లేని దర్శకుడు..
అనిల్ రావిపూడి లాస్ట్ సినిమా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’. ఈ మూవీ దాదాపు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో అసలు ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుల లిస్ట్‌లో అనిల్ కూడా యాడ్ అయిపోయాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్‌కు కూడా అలాంటి సక్సెస్సే కావాలి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సైంధవ్’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమాకు ఎక్కువగా నెగిటివ్ రివ్యూలే వస్తున్నాయి. ఇక అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సక్సెస్‌ఫుల్ చిత్రాలు తెరకెక్కగా.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నారట.
మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..
ఇప్పటికే వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తుండగా.. ఇందులో వరుణ్ తేజ్ కూడా యాడ్ అయ్యాడని అప్డేట్ బయటికొచ్చింది. ఇప్పటికే వరుణ్ చేతిలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి రెండు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక వీటి తర్వాత అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా సెట్‌లో అడుగుపెట్టనున్నాడట వరుణ్ తేజ్. ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా పేరు తెచ్చుకుంది. ఇంతలోనే ఈ కాంబినేషన్‌లోనే మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కనుందని తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్..
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.. ఇప్పుడు అనిల్ రావిపూడి, వెంకటేశ్, వరుణ్ తేజ్ హ్యాట్రిక్ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిని మార్చనున్నట్టు సమాచారం. డీఎస్‌పీ స్థానంలో భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలను నిర్మించిన దిల్ రాజు.. దీనిని కూడా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. దిల్ రాజు ఎస్‌వీసీ బ్యానర్‌లోనే ఈ హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనుంది. త్వరలోనే ఈ చిత్రం లాంచ్‌కు సిద్ధమవుతుందని టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: పూనమ్ పాండేను బాయ్‌కాట్ చేయాలి - నటిపై విరుచుకుపడ్డ కంగనా, మందిర బేడీ