కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha). మహా శివరాత్రి సందర్భంగా శనివారం (ఫిబ్రవరి 18న) విడుదలైంది. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా మంచి వసూళ్ళు నమోదు చేస్తోంది. 


మొదటి రోజు 2.75 కోట్లు!
'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాకు ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. అన్ని ప్రీమియర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. శివరాత్రి రోజు కూడా సినిమాకు మంచి ఆదరణ కనిపించిందని, తొలి రోజు సినిమా 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. 


ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రమిది. 'బన్నీ' వాస్ నిర్మించారు. ఇందులో కశ్మీరా పరదేశి కథానాయికగా నటించారు. మురళీ శర్మ కీలక పాత్ర పోషించారు. 


Also Read రామ్ చరణ్‌తో కాదు, కన్నడ హీరోతోనే కన్నడ దర్శకుడి నెక్స్ట్ సినిమా 






సినిమాలో కిరణ్ అబ్బవరం, మురళీ శర్మ, కశ్మీర మధ్య సన్నివేశాలకు మంచి పేరు వస్తోందని చిత్ర బృందం పేర్కొంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాయి. ఒక్క జానర్ అని కాకుండా సినిమాలో మల్టిపుల్ జానర్స్ టచ్ చేశారు. ఎండింగ్ అయితే థ్రిల్లర్ ఫీల్ ఇచ్చిందని ఆడియన్స్ పేర్కొంటున్నారు.


'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో', '18 పేజెస్' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ సంస్థలో మరో కమర్షియల్ సక్సెస్ ఇది. గత ఏడాది గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసిన 'కాంతార', 'మాలికాపురం' సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. 


Also Read : తారకరత్న వారసులు ఎంత మందికి తెలుసు? చిన్న కుమార్తె, కొడుకు గురించి...
   
'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి మొదట 'వాసవ సుహాస...' పాటను విడుదల చేశారు. ఆ బాణీ, అందులో సాహిత్యం, గానం ఎంత శ్రావ్యంగా ఉన్నాయో ప్రేక్షకులు అందరూ విన్నారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ ఆ పాటను విడుదల చేశారు. అప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. సినిమాకు ఆ సాంగ్ మంచి బజ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత విడుదల చేసిన 'దర్శనా...' సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడది యువతకు లవ్ యాంథమ్ కింద మారింది. సినిమాలో కూడా పాటలు బావున్నాయని పేరు వచ్చింది. తిరుపతి నేపథ్యంలో ఆ పాటలను అందంగా చిత్రీకరించారు. 


సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు నిర్మాత 'బన్నీ' వాస్ వెల్లడించారు. అంతే కాదు... ఇందులో నటీనటులు ఎవరూ మద్యం సేవించే సన్నివేశాలు గానీ, సిగరెట్ తాగే సీన్లు గానీ లేవని ఆయన చెప్పారు. అందువల్ల,లిక్కర్ & సిగరెట్ యాడ్ ఉండదన్నమాట. తిరుపతి నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఏడు కొండల వెంకటేశ్వర స్వామి నేపథ్యంలో ఆ సీన్లు ఉండటం సబబు కాదని చిత్ర బృందం భావించి ఉండొచ్చు. ఏది ఏమైనా వాళ్ళు తీసుకున్నది మంచి నిర్ణయం అని చెప్పాలి.