మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా వరుణ్ తేజ్ 15వ చిత్రమిది (VT15 Movie). దీనికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు క్రేజీ టైటిల్ ఖరారు చేశారు.
'కొరియన్ కనకరాజు'గా వరుణ్ తేజ్!
VT15 movie titled Korean Kanakaraju: హారర్ కామెడీ జానర్‌లో వరుణ్ తేజ్ 15వ సినిమా రూపొందుతోంది. దీనికి 'కొరియన్ కనకరాజు' టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో రానుందీ వస్తోంది.
Varun Tej's VT15 Movie Pooja Ceremony: పూజా కార్యక్రమాలతో ఆదివారం (మార్చి 23) 'కొరియన్ కనకరాజు' సినిమా ప్రారంభం కానుంది. మరి, ఓపెనింగ్ తర్వాత టైటిల్ అనౌన్స్ చేస్తారో? లేదో? వెయిట్ అండ్ సి.
Also Read: ఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?
'కొరియన్ కనకరాజు' చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వియత్నాంలో కొన్ని రోజులు జరిగింది. హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీతో పాటు నిర్మాతలు వియత్నాంలో అద్భుతమైన లొకేషన్స్ చూసి వచ్చారు. స్క్రిప్ట్ వర్క్ కూడా శరవేగంగా పూర్తి చేశారు. వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీ అవుతుందని యూనిట్ నమ్ముతోంది.
Also Read: మీనాను అవమానించిన నయనతార... రెజీనా సెల్ఫీ తీయడంతో అసంతృప్తి, అలక?
'కొరియన్ కనకరాజు' సినిమా కోసం దర్శకుడు మేర్లపాక గాంధీ యూనిక్ స్టోరీ లైన్ డిజైన్ చేశారట. సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెడీ అవుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్ (Varun Tej Look In Korean Kanakaraju)తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు.