Varun and Vithika Dream House Warming: వరుణ్ సందేశ్, వితికా షెరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించిన వీరిద్దరు, ఆ తర్వాత నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ‘హ్యాపీ డేస్‌’ మూవీతో మంచి హిట్ అందుకున్న వరుణ్, ‘కొత్త బంగారులోకం’ సినిమాతో స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోయాడు. అదే సమయంలో హీరోయిన్ వితికా షెరుతో కలిసి ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రంలో నటించారు. రీల్ లైఫ్ లో ప్రేమికులుగా నటించిన వీరిద్దరు, రియల్ లైఫ్ లోనూ ప్రేమలో పడ్డారు. 2016, ఆగస్టు 19న వితిక- వరుణ్ పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లి తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఈ జంటకు ప్రస్తుతం పెద్దగా ఆఫర్స్‌ రావడం లేదు. బిగ్‌బాస్‌ ౩ సీజన్‌లో జంటగా వచ్చిన ఈ జంట ఆ తర్వాత పలు టీవీ షోల్లో కలిసి సందడి చేస్తున్నారు. అయితే వితిక సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ పెట్టి అందులో తన డైయిలీ రోటిన్‌ నుంచి స్పెషల్‌ డేస్‌ విశేషాలను నెటిజన్లతో పంచుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల తమ డ్రీమ్‌ హౌజ్‌ను ఫుల్‌ఫిల్‌ చేసుకుంది ఈ జంట. ఈ క్రమంలో తమ డ్రీమ్‌ హౌజ్‌లోకి మారారు. తాజాగా కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన వీడియోను షర్‌ చేసింది. నిజానికి రితికకు తన టేస్ట్‌కు తగ్గట్టు కొత్త ఇంటిని నిర్మించుకోవాలనే కల. అది కుదరకపోవడంతో ఉన్న ఇంటినే తన టేస్ట్‌కు తగ్గట్టుగా రెనోవేషన్‌ చేయించుకుంది.

అదీ పూర్తి కావడంతో తమ డ్రీమ్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టారు ఈ బిగ్‌బాస్‌ జంట. ఇంటి రెనోవేషన్‌ నుంచి గృహప్రవేశం వరకు రితిక తీసుకున్న జాగ్రత్తలను ఈ వీడియోలో షేర్‌ చేసిందామె. ఫైనల్‌గా నా కల నిజమైందంటూ వితికి తెగ మురిసిపోయింది. తమ ఇంటి గురించి వివరిస్తూ ప్రతి విషయంలో తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో వివరించింది. ఈ వీడియోకు "నేను ఎప్పుడూ నా స్వంత డబ్బుతో నా స్వంత ఇంటిని నిర్మించుకోవాలని కలలు కన్నాను. కానీ దేవుడు వేరే ప్రణాళికతో ఉన్నాడు. అందుకే పాత ఇంటినే రెనోవేట్‌ చేసుకునేలా ప్లాన్‌ చేశాడు. మా అత్తయ్య-మామయ్యల ఫస్ట్‌ ఇంటిని ఇలా రీడిజైన్‌ చేయించాను. నా టేస్ట్‌ తగ్గట్టుగా ఈ ఇంటిని దగ్గరుండి డిజైన్‌ చేయించుకున్నాను. ఇది నన్ను మరింత గర్వపడేలా చేసింది. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, నిజంగా గర్వపడుతున్నాను" అంటూ వీడియోకు రాసుకొచ్చింది.

Also Read: తీవ్ర అస్వస్థతకు గురైన 'బిగ్‌బాస్‌' ప్రియాంక సింగ్‌ - ఆస్పత్రిలో చికిత్స.

చాలా రోజులు తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను, అలాగే నేను చాలా ఎగ్జైట్‌మెంట్‌గా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజే అందరు ఈ ఇంటిని ఫస్ట్‌టైం చూడబోతున్నారంటూ వీడియో ఇలా చెప్పుకొచ్చింది. అంతేకాదు "అందరు వీడియోలు షేర్ చేయమని, ఎందుకు ఎక్కువగా వీడియోలు చేయరంటూ అడుగుతుంటారు. వీడియోలు చేయాలంటే సొంతిళ్లు ఉండాలి కదా. ఇప్పుడు మా సొంత ఇంటి.. డ్రీమ్‌ హౌజ్‌ రెడీ అయ్యింది. ఇక నుంచి వీకు వరుసగా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఢిఫరెంట్‌, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఇక మీకు వీడియో షేర్‌ చేస్తూనే ఉంటా" అంటూ వితిక ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఇప్పటి వరకు రెంట్‌ హౌజ్‌లో ఉన్న ఈ కపుల్‌ తాజాగా తమ టెస్ట్‌తో డ్రీమ్‌ హౌజ్‌ కల నెరవేర్చుకోవడం వితికి-వరుణ్‌ సందేశ్‌లకు స్నేహితులు, సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.