బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో ఓ హిందీ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'VD 18' అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అయితే సోమవారం (ఫిబ్రవరి 5) మేకర్స్ ఈ సినిమా టైటిల్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్ తో పాటుగా, ఆయన పాత్రలోని ఇంటెన్సిటీని పరిచయం చేసే వీడియో గ్లింప్స్ ను ఆవిష్కరించారు. పనిలో పనిగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.


VD18 చిత్రానికి 'బేబీ జాన్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా 2024 మే 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఇది ఈ ఏడాదిలో వచ్చే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు. ఇక టైటిల్ గ్లింప్స్ లోకి వెళ్తే, వరుణ్ ధావన్ ను పవర్ ఫుల్ పాత్రలో ప్రెజెంట్ చేశారు. మునుపెన్నడూ చూడని యాక్షన్‌ అవతార్ లో చూపించి ఆకట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే ఎస్. తమన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. 






2016లో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ 'తేరీ' చిత్రానికి అధికారిక రీమేక్ గా 'బేబీ జాన్' తెరకెక్కుతోంది. తమిళ్ లో దళపతి విజయ్, సమంత, అమీ జాక్సన్ కలిసి నటించారు. ఇప్పుడు ఆ పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, రాజ్‌ పాల్ యాదవ్ సహా పలువురు ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


గతేడాది 'జవాన్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీతో బాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన అట్లీ.. ఇప్పుడు 'బేబీ జాన్' సినిమాతో నిర్మాతగా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో ఏ ఫర్ యాపిల్, సినీ1 స్టూడియోస్‌ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ. కాళేశ్వరన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. మురాద్ ఖేతాని, ప్రియా అట్లీ, జ్యోతి దేస్ పాండే నిర్మాతలుగా వ్యవహరుస్తున్నారు.


'బేబీ జాన్' తో మహానటి బాలీవుడ్ ఎంట్రీ...
'బేబీ జాన్' కీర్తి సురేష్ కు బాలీవుడ్ డెబ్యూ. ఇన్నాళ్లూ తన సహజమైన నటనతో సౌత్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్.. హిందీ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. దీంతో పాటుగా మరో నాలుగు సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది కీర్తి. జయం రవితో కలిసి ఆమె నటించిన 'సైరెన్‌' చిత్రం ఈ నెల 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అలానే 'రివాల్వర్‌ రీటా', 'రఘుతాత', 'కన్నివేడి' వంటి తమిళ్ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. 


Also Read: VIJAY POLITICAL PARTY - ఎంజీఆర్‌ టు విజయ్‌.. రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్స్ వీళ్లే!