varalaxmi sarathkumar Wedding Celebrations Begin: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి సందడి మొదలైంది. ఆమెను పెళ్లి కూతురు చేశారు. ఇరుకుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రీవెడ్డింగ్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ప్రీ వెడ్డింగ్‌లో వరలక్ష్మి తన కాబోయే భర్తను ఆలింగనం చేసుకుని కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వరలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. దీనికి 'బిగిన్' అని క్యాప్షన్‌ ఇచ్చింది. 


థాయ్‌లాండ్‌లో పెళ్లి..


కాగా వరలక్షి శరత్‌ కుమార్‌ తన ప్రియుడు నికోలయ్‌‌ సచ్‌దేవ్‌తో పెళ్లీ పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. జూలై 2న వరలక్ష్మి, నికోలయ్‌‌ సచ్‌దేవ్‌లు వివాహం జరగనుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఈ క్రమంలోనే ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. చూస్తుంటే ఇది వారి హల్దీ వేడుకల కనిపిస్తుంది. ఈ ఈవెంట్‌ ముంబైలో జరిగినట్టు సమాచారం. కాగా వరలక్ష్మి శరత్‌ కొద్ది రోజులుగా తన పెళ్లి సంబంధించిన పనులు ఆమె దగ్గరుండి చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమె స్వయంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించింది. కోలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన స్టార్స్‌ ఇంటికి వరలక్ష్మి స్వయంగా వెళ్లి పెళ్లి పత్రిలకు ఇచ్చింది.


మార్చిలో నిశ్చితార్థం..


సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, దళపతి విజయ్‌, అజిత్ నుంచి టాలీవుడ్‌లో రవితేజ, డైరెక్టర్‌ శంకర్‌, ప్రశాంత్‌ వర్మ, హీరో అల్లు అర్జున్‌ ఇలా పలువురికి పెళ్లి పత్రికలు ఇచ్చిన ఆహ్వానం అందించింది. ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించిన వరలక్ష్మి తన పెళ్లి తేదీని మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. కానీ, జూలై 2న ఆమె వివాహ వేడుక థాయ్‌లాండ్‌ గ్రాండ్‌గా జరగనుందని ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి పెళ్లికి ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. కానీ, ఇంకా ఈ కాబోయే వధువరులు ముంబైలోనే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చి 1న వరలక్ష్మి శరత్‌ కుమార్‌, నికోలయ్‌‌ సచ్‌దేవ్‌లు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కేవలం ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు రింగులు మార్చుకున్నారు.






సైలెంట్‌గా జరిగిన వీరి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు ఆ తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అవి చూసి అంతా షాక్‌ అయ్యారు. సడెన్‌ వరలక్షి నిశ్చితార్థం చేసుకోవడంతో అంతా కంగుతిన్నారు. ఇక ఏదేమైనా వరలక్ష్మి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతుందని తెలిసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెకు విషెస్‌ తెలిపారు. ఇకపోతే వరలక్ష్మి కాబోయే భర్త నికోలయ్‌‌ సచ్‌దేవ్‌కు ఇదివరకు పెళ్లైనట్టు సినీ సర్కిల్లో టాక్. గతంలో అతడు ఓ మోడల్‌ కవితని పెళ్లి చేసుకున్నాడని, వారిద్దరికి 15 ఏళ్ల కూతురు కూడా ఉందని సమాచారం. అయితే వీరిద్దరు కొన్నేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వరలక్ష్మితో పరిచయం, ప్రేమగా మారడంతో వీరిద్దరు ఇప్పుడు పెళ్లి పీటల ఎక్కబోతున్నారు.