ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. హీరోలే కాదు... హీరోయిన్లు కూడా పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. సమంత 'శాకుంతలం', 'యశోద' చేస్తున్నారు. 'యశోద'లో కీలక పాత్ర చేస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేశారు.


'క్రాక్'లో నెగెటివ్ రోల్... 'నాంది'లో న్యాయవాది... తమిళ్ మూవీ 'సర్కార్'లో ఓ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కుమార్తెగా ప్రతినాయక ఛాయలున్న క్యారెక్టర్... ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం వరలక్ష్మీ శరత్ కుమార్ స్టైల్. ఒక భాషకు, ఇమేజ్‌కు పరిమితం కాలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆమెకు అభిమానులు ఉన్నారు. సరికొత్త పాత్రతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు ఆమె రానున్నారు.


Varalaxmi Sarathkumar starts Pan India movie Sabari: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న సినిమా 'శబరి'. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో నిరాడంబరంగా ప్రారంభమైంది.


'శబరి' ముహూర్తపు సన్నివేశానికి 'పెళ్ళైన కొత్తలో' దర్శకుడు మదన్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, 'నాంది' సినిమా నిర్మాత సతీష్ వేగేశ్న క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ నిర్మాత పోకూరి బాబూరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Also Read: 'యశోద' రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసిన సమంత






"క్రైమ్ నేపథ్యంలో రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గోపీసుందర్ స్వరాలు చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు, నటీనటులతో దర్శకుడిగా నా తొలి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత మహేంద్రనాథ్ గారికి థాంక్స్" అని దర్శకుడు అనిల్ కాట్జ్ తెలిపారు. "వరలక్ష్మీ శరత్ కుమార్ గారు ఇప్పటి వరకూ చేయని పాత్రను మా 'శబరి' సినిమాలో చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం" అని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల చెప్పారు. 


Also Read: 'ఆర్ఆర్ఆర్' మూడు సార్లు చూశా! తెలుగులో నా ఫేవరేట్ హీరో ఎవరంటే? - సయీ మంజ్రేకర్ ఇంటర్వ్యూ