సమంత నేషనల్ స్టార్. తెలుగు సినిమాలు చేశారు. నటిగా పేరు తెచ్చుకున్నారు.  భారీ కమర్షియల్ విజయాలు అందుకున్నారు. ఆ విజయాల్లో మహిళా ప్రాధాన్య చిత్రాలూ ఉన్నాయి. అటు మాతృభాష తమిళంలో సినిమాలు చేశారు. విజయాలు అందుకున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా జాతీయ స్థాయిలో నటిగా పేరు తెచ్చుకున్నారు. అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆగస్టులో 'యశోద'తో అన్ని భాషల ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో ఒకేసారి రానున్నారు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ మీద గురి పెట్టారు. 


సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'యశోద'. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్టు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నేడు వెల్లడించారు.


పాన్ ఇండియా అని 'యశోద' దర్శక నిర్మాతలు ఎక్కడా చెప్పడం లేదు. కానీ, పాన్ ఇండియా మూవీస్ ఎన్ని భాషల్లో విడుదల అవుతున్నాయో? అన్ని భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు. సమంతకు ఈ సినిమా ఒక పరీక్ష లాంటిది. ఇది అన్ని భాషల్లో  విజయం సాధిస్తే... నెక్స్ట్ నుంచి పాన్ ఇండియా మూవీస్ ఎక్కువ ప్లాన్ చేయొచ్చు. సాధారణంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు మల్టీప్లెక్స్, ఏ సెంటర్ ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ వస్తుంది. 'యశోద' యాక్షన్ థ్రిల్లర్ కనుక బి, సి సెంటర్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువ. సో... మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.


నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ల‌లో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్‌తో సమంత ఆకట్టుకుంటారు. ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. మే నెలాఖరుకు చిత్రీకరణ పూర్తవుతుంది. థ్రిల్లర్ జాన‌ర్‌లో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ రోజు కొడైకెనాల్ లో షూటింగ్ స్టార్ట్ చేశాం" అని చెప్పారు.


Also Read: దివ్య భారతి మరణం, మ్యారేజ్ మిస్టరీయే! మూడేళ్ళలో 30 ఏళ్ళకు సరిపడా ఫేమ్!


సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగ‌ణం. ఈ చిత్రానికి మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.


Also Read: 'ఆర్ఆర్ఆర్' మూడు సార్లు చూశా! తెలుగులో నా ఫేవరేట్ హీరో ఎవరంటే? - సయీ మంజ్రేకర్ ఇంటర్వ్యూ