తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న సినిమా 'వారసుడు' (Thalapathy Vijay's Varasudu Movie). తమిళంలో 'వారిసు' (Varisu) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ రోజు విజయ్ పుట్టినరోజు (Vijay Birthday) సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ నిన్న పోస్ట్ చేశారు. ఈ రోజు సెకండ్ లుక్ పోస్ట్ చేశారు.


'వారసుడు' ఫస్ట్ లుక్‌లో సూటు, బూటుతో విజయ్ స్టయిలిష్‌గా కనిపిస్తే... సెకండ్ లుక్‌లో చిన్న పిల్లల మధ్యలో చిల్డ్ అవుట్ మూడ్‌లో ఉన్నారు. రెండు లుక్స్ చూస్తే... సినిమాలో విజయ్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని అర్థం అవుతోంది.


'వారసుడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా


ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.


Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు