థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ వేదికలోకి సినిమాలు వస్తున్న రోజుల్లోకి వచ్చేశాం. అఫ్‌కోర్స్‌... కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన వారానికే ఓటీటీలో దర్శనం ఇచ్చాయి. ఇంకొన్ని ఆలస్యంగా వచ్చాయి. అయితే...  ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన ఎనిమిది నెలలకు ఓటీటీలో వస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది 'పెళ్లి సందD' అని చెప్పాలి.


శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీల జంటగా నటించిన సినిమా 'పెళ్లి సందD'. గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దర్శ కేంద్రులు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. గత ఏడాది అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇన్నాళ్లకు... థియేటర్లలోకి వచ్చిన ఎనిమిది నెలలకు ఓటీటీలోకి వస్తోందీ సినిమా.


Also Read : గోవాలో యాక్సిడెంట్ - తీవ్ర గాయాలైన నటుడిని హెలికాప్టర్‌లో బెంగళూరుకు తరలించిన కుటుంబ సభ్యులు


జూన్ 24న... అనగా ఈ శుక్రవారమే జీ 5 ఓటీటీలో 'పెళ్లి సందD' డిజిటల్ రిలీజ్. ''పెళ్లి సందD చేయడానికి రెడీనా? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్! అందరూ ఆహ్వానితులే'' అని 'జీ 5' ఓటీటీ పేర్కొంది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఆయన తండ్రి శివశక్తి దత్తా, శ్రీధర్ సీపాన కథ అందించారు. ఈ సినిమాలో రాఘవేంద్ర రావు  నటించడం విశేషం.


Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు