అందాల భామలకు ఆన్ లైన్‌లో ఆకతాయిల నుంచి వేధింపులు తప్పడం లేదు. కొంత మంది తమను ఏ విధంగా వేధిస్తున్నదీ? తమపై ఎటువంటి కామెంట్స్ చేస్తున్నదీ స్క్రీన్ షాట్స్ తీసి మరీ చూపిస్తున్నారు. మరికొందరు విసిగిపోయి వదిలేస్తున్నారు. ఆన్ లైన్ వేధింపులకు ఉర్ఫీ జావేద్ (Urfi Javed) కూడా బాధితురాలే. ఆన్ లైన్ ట్రోల్స్, రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్న వ్యక్తుల గురించి లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆమె ఒక పోస్ట్ చేశారు.


Urfi Javed On Online Abuse Trolls : ''ఇండియాలో సైబర్ లాస్ (చట్టాలు) లేవు. పోలీసులు, సైబర్ సెల్ డిపార్ట్‌మెంట్‌ రిజిస్టర్ అయిన కంప్లైంట్స్ మీద ఎటువంటి అతి కష్టం మీద దృష్టి పెడతారు. అందువల్ల, ప్రజలు కంప్లైంట్స్ ఇవ్వడం మానేస్తున్నారు. ఆకతాయిలు ఓపెన్ గా తిడుతున్నారు, వేధిస్తున్నారు, రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు. మనం ఈ విషయాన్ని ఎందుకు వదిలేయాలి? నాకు అర్థం కావడం లేదు'' అని ఉర్ఫీ జావేద్ పోస్ట్ చేశారు. 


గతంలోనూ రేప్ థ్రెట్స్ గురించి మాట్లాడిన ఉర్ఫీ జావేద్
ర‌ణ్‌వీర్‌ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేసినప్పుడు... ఆయనపై కేసు నమోదు అయ్యింది. అప్పుడు ఉర్ఫీ జావేద్ హాట్ హాట్ ఫోటో షూట్స్ ప్రస్తావన తీసుకు వచ్చారు కొందరు. ఇటువంటి కేసులు, మనోభావాల విషయంలో లింగ వివక్ష చూపించకూడదని పేర్కొన్నారు. అప్పుడు ఆమె స్పందించారు.


Also Read : టాప్ లేపేసిన ఉర్ఫీ జావేద్ - కేవలం జుట్టు మాత్రమే అడ్డు పెట్టుకుని... 


''న్యూడ్ ఫోటో షూట్ వివాదంలోకి నన్ను లాగకుండా ర‌ణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh) కు సపోర్ట్ చేయొచ్చు.  ఇక్కడ అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే... జాలి, దయ, కనికరం లేకుండా నన్ను ట్రోల్ చేశారు. రేప్ చేస్తామని బెదిరించారు. చంపేస్తామన్నారు. నేనూ ట్రోలింగ్ ఎదుర్కొన్నాను'' అని ఉర్ఫీ గతంలో వ్యాఖ్యానించారు (Urfi Javed Sensational Comments).


ఉర్ఫీ జావేద్ అంటే హాట్ హాట్ ఫోటోలు, వీడియోలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ముంబై ఎయిర్ పోర్టులో ప్రతి రోజూ సరికొత్త దుస్తులతో అందాల ప్రదర్శన చేస్తుంటారు. భారతీయ సంస్కృతిని పాడు చేస్తున్నారంటూ ఆమెపై చాలా మంది సాంప్రదాయ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీ సంగతి!


Also Read : 'మా'లో సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వండి - నిర్మాతలకు విష్ణు మంచు రిక్వెస్ట్, 'దిల్' రాజుతో డిస్కషన్