Asvins Release Date : వెర్సటైల్ యాక్టర్ వసంత్ రవి నటించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’ విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం అంటే జూన్ 23న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు నూతన దర్శకుడు తరుణ్ తేజ రచన, దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలో విమలా రామన్, మురళీధరన్ లు కీలక పాత్రలు పోషించారు.
తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన‘అశ్విన్స్’.. కేవలం పెద్దలు మాత్రమే చూడాలని సూచిస్తూ.. ఏ (A Rating) రేటింగ్‌తో సర్టిఫికేట్ పొందినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 18 ఏళ్ల లోపు వారు సినిమా చూడకూడదని ఈ సందర్భంగా మేకర్స్ హెచ్చరిస్తున్నారు. సిమ్రాన్ పరీక్, ఉదయ దీప్, సరస్వతి మీనన్ తో పాటు మరికొందరు నటీనటులు ఈ థ్రిల్లర్ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ఈ చిత్రానికి నిధులు సమకూర్చారు. విజయ్ సిద్ధార్థ్ సంగీత దర్శకుడు.
ఋగ్వేదంలో పేర్కొన్న అశ్వినీ దేవతలు గురించి మనం పురాణాల్లో చదువుకునే ఉంటాం. ఈ కాన్సెప్ట్ ఆధారంగా 'అశ్విన్స్' సినిమాను రూపొందించారు. కాగా ఈ మొత్తం సినిమా షూటింగ్ ను లండన్‌లో చిత్రీకరించారు. వసంత్ రవి ఈ చిత్రంలో ఓ యూట్యూబర్ పాత్రలో నటించారు.
ఇక 'అశ్విన్స్' సినిమాకు సంబంధించి రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ చీకటి ప్రపంచం నుంచి మానవులకు చెడును చేసే 1500 ఏళ్ల నాటి శాపాని వివరిస్తూ కథను సాగించారు. దీని కారణంగా అమాయకులైన కొంత మంది యూ ట్యూబర్స్ బలైపోతుంటారు. ట్రైలర్ చూస్తుంటేనే తెలియని భయం వెంటాడుతుంది. ఇక సినిమాలోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వాటికి తగ్గట్టు అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సన్నివేశాలను మరో లెవల్లో ఎలివేట్ చేస్తున్నాయి. హారర్ చిత్రాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉండడంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ మూవీలో వసంత్ రవితో పాటు విమలా రామన్, మురళీ ధరన్ (నంబీ ఎఫెక్ట్ ఫేమ్), సారస్ మీనన్, ఉదయ దీప్ (‘నిలా కాలమ్’తో జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ విన్నర్), సిమ్రాన్ పరీక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ సిద్ధార్థ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ రాజీన్ ఎడిటర్‌గా వ్యవహించారు. ఇక డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. ఈ ఏడాది ‘విరూపాక్ష’ వంటి మిస్టికల్ థ్రిల్లర్‌ను అందించి బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే.
Read Also : Sriya Reddy On Salaar : 'కెజియఫ్' కాదు, అంతకు మించి, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' రేంజ్‌లో 'సలార్' - శ్రియా రెడ్డి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial