6 Upcoming Telugu Re Releases: ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. థియేటర్లలోకి 'కుబేర' వంటి కొత్త మూవీస్ వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంటున్నా.. రీ రిలీజ్ మూవీస్ కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. మెగాస్టార్ అప్పటి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' నుంచి మహేష్ బాబు 'ఖలేజా', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వరకూ మూవీస్ రీ రిలీజ్‌లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఇక వచ్చే నెలలో థియేటర్స్ వద్ద రీ రిలీజ్‌ల సందడి కనిపించనుంది. ఒకేసారి 6 హిట్ మూవీస్ బాక్సాఫీస్ వద్దకు మళ్లీ రానున్నాయి. లవ్, కామెడీ, మాస్ ఎంటర్‌టైనర్స్ తెలుగు ఆడియన్స్‌ను అలరించబోతున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో ఓసారి చూస్తే..
కామెడీ యాక్షన్.. 'హనుమాన్ జంక్షన్'
హనుమాన్ జంక్షన్.. ఈ మూవీ పేరు వింటేనే మన ముఖాలపై చిరునవ్వు వస్తుంది. అర్జున్, జగపతి బాబు, వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. లయ, స్నేహ, విజయలక్ష్మి, అలీ, ఎల్బీ శ్రీరాం కీలక పాత్రలు పోషించారు. ఆడియన్స్‌కు వినోదాల విందు అందించేందుకు మరోసారి ఈ సినిమా రాబోతోంది. ఈ నెల 28 థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కుమారి 21ఎఫ్'
అప్పట్లో యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్న లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కుమారి 21 F'. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సుకుమార్.. స్టోరీ, స్క్రీన్ ప్లేతో పాటు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ మూవీతో హెబ్బ స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు మళ్లీ రానుంది.
Also Read: అఖిల్ 'లెనిన్' నుంచి శ్రీలీల అవుట్? - బిగ్ ట్విస్టుకు అదే అసలు కారణమా!
మాస్.. 'మిరపకాయ్'
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మిరపకాయ్'. రవితేజ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, థమన్ మ్యూజిక్ అప్పట్లో ట్రెండింగ్‌గా నిలిచాయి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. రవితేజ జోడీగా బ్యూటీ రీచా గంగోపాథ్యాయ నటించారు. జులై 11న ఈ మూవీ రీ రిలీజ్ కానుంది.
సూర్య.. 'గజిని'
కోలీవుడ్ స్టార్ సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'గజిని'. 15 నిమిషాలకు ఓసారి గతం మర్చిపోయే డిఫరెంట్ క్యారెక్టర్‌లో సూర్య మెప్పించారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సూర్య సరసన ఆసిన్ హీరోయిన్‌గా నటించారు. నయనతార కీలక పాత్ర పోషించారు. మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేయగా.. మంచి కలెక్షన్స్ సాధించింది. తాజాగా.. మరోసారి జులై 18న ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనుంది.
ఏమాయ చేశావే..
యంగ్ హీరో నాగచైతన్య, సమంత నటించిన ఎవర్ గ్రీన్ లవ్ ఎంటర్‌టైనర్ 'ఏమాయ చేశావే'. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ మూవీతోనే సమంత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకున్నారు. చై, సమంతల లవ్ స్టోరీకి ఈ మూవీనే స్టార్టింగ్ అని చెప్పొచ్చు. ఈ మూవీ జులై 18న రీ రిలీజ్ కానుంది.
వీడొక్కడే..
సూర్య, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన హిట్ మూవీ వీడొక్కడే. కేవీ ఆనంద్.. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.