Sreeleela Out From Akhil Lenin Movie: యంగ్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ 'లెనిన్'. చాలా రోజుల గ్యాప్ తర్వాత హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే.. సినిమాపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
బిగ్ ట్విస్ట్ ఇచ్చారుగా..
వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రీలీల.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనుందనే వార్తలు వస్తున్నాయి. షూటింగ్ షెడ్యూల్‌లో ప్రొడ్యూసర్స్‌తో విభేదాల కారణంగా వేరే హీరోయిన్ కోసం వారు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గత కొంతకాలంగా శ్రీలీల ఖాతాలో సరైన హిట్ పడలేదు. అయినా.. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఆమె లాస్ట్‌గా నితిన్ 'రాబిన్ హుడ్'తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండు హిందీ సినిమాలు, ఓ తమిళ మూవీ ఉన్నాయి. రవితేజ 'మాస్ జాతర'లోనూ నటించగా.. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఆమెనే హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది.
అదే అసలు కారణమా?
శ్రీలీల ప్రస్తుతం హిందీలో 'ఆషికి 3', తమిళంలో 'పరాశక్తి' మూవీ చేస్తున్నారు. తాజాగా ఈమె నటించిన కన్నడ మూవీ 'జూనియర్' రిలీజ్ కావాల్సి ఉంది. అయితే.. ఆమె ఎక్కువగా తమిళం, హిందీ సినిమాలకే డేట్స్ ఇస్తున్న కారణంగా.. 'లెనిన్' ప్రాజెక్ట్ నుంచి ఆమెను తప్పించాలని టీం భావిస్తోందట. కొత్త హీరోయిన్ కోసం ప్రొడ్యూసర్స్ అన్వేషిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ఇక 'లెనిన్' విషయానికొస్తే.. లవ్ స్టోరీతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఈ మూవీకి 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేం మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Also Read: 'కన్నప్ప' థియేటర్స్ దగ్గర ప్రభాస్ మేనియా... తెలుగు రాష్ట్రాలలో భారీ కటౌట్లు!
గ్లింప్స్ అదుర్స్
ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది. అఖిల్ ఇప్పటివరకు ఎన్నడూ చూడని మాస్ లుక్‌లో అదరగొట్టారు. రాయలసీమ నేపథ్యంలో మూవీ తెరకెక్కుతుండగా.. దట్టమైన మీసం, పొడవాటి జుట్టు, రాయలసీమ యాసతో అఖిల్ వేరే లెవల్‌లో కనిపించారు. ఆయన నుంచి ఈ రేంజ్ మాస్ ఊహించలేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రతీక్ గాంధీని విలన్‌గా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి.
అఖిల్ ఖాతాలో ఇప్పటివరకూ సరైన హిట్ పడలేదు. చివరిగా ఆయన 'ఏజెంట్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆచి తూచి వ్యవహరించారు. డిఫరెంట్ కాన్సెప్ట్, టైటిల్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారైన హిట్ కొట్టాలని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.