సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కూలీ' (Coolie). ఆగస్టు 14న విడుదల. లోకనాయకుడు కమల్ హాసన్‌కు 'విక్రమ్' వంటి 400 కోట్ల సినిమా ఇచ్చిన లోకేష్ కనకరాజు దీనికి దర్శకుడు. కార్తీ హీరోగా లోకేష్ తీసిన 'ఖైదీ', విజయ్ హీరోగా తీసిన 'మాస్టర్' - 'లియో' సినిమాలు కమర్షియల్ సక్సెస్ సాధించాయి. 'జైలర్' సినిమాతో రజని మరోసారి తన స్టార్‌డమ్ ఏమిటనేది చూపించారు. దాంతో 'కూలీ' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళనాడులో మాత్రమే కాదు తెలుగులో సైతం ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ నెలకొంది. దాంతో డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం టాప్ ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారు.

'కూలీ' రైట్స్ రేసులో టాప్ ప్రొడ్యూసర్లు...నాగార్జున చక్రం తిప్పితే అన్నపూర్ణ సంస్థకు!'కూలీ'లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించారు. సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు సైమన్. విలన్ రోల్ అని టాక్. నాగార్జున హీరో మాత్రమే కాదు... నిర్మాత కూడా! ఆయన ఫ్యామిలీకి హైదరాబాద్ సిటీలో స్టూడియోలు ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ పేరు మీద ఫిలిం ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు.

'కూలీ' సినిమాను తెలుగులో అన్నపూర్ణ సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలని నాగర్జున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన కనుక గట్టిగా పట్టుపడితే అన్నపూర్ణ సంస్థకు తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వస్తాయి. లేదంటే వేరే నిర్మాతల చేతికి వెళతాయి.

'కూలీ' చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకం మీద కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేశారు. సాధారణంగా ఆ సంస్థ నుంచి వచ్చే సినిమాలను తెలుగులో సునీల్ నారంగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆయనతో పాటు సురేష్ బాబు - 'దిల్' రాజు కూడా జాయిన్ అవుతారు. అయితే నాగార్జున లేదంటే ఈ ముగ్గురికి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వస్తాయని భావిస్తున్న టైంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ రేసులోకి రావడంతో రైట్స్ ఎవరి సొంతం అవుతాయి అనే అంశం కీలక మలుపు తీసుకుంది.

'కూలీ' తెలుగు రైట్స్ కోసం 44 కోట్ల రూపాయలను నాగవంశీ కోట్ చేశారట. ఆయన కోసం సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ రికమండేషన్ చేసినట్లు టాక్. మరొక వైపు రజనీకాంత్ 'వేట్టయాన్'లో విలన్ రోల్ చేసిన రానా కూడా రికమండేషన్ కోసం రంగంలోకి దిగారట. ఆయన కూడా రైట్స్ కోసం రజనీ దగ్గరకు వెళ్లారట. తన తండ్రి సురేష్ బాబు అండ్ సునీల్ నారంగ్ - 'దిల్' రాజుకు ఇవ్వమని అడిగారట.‌ ఈ ముగ్గురిని పక్కన పెడితే మరొక నిర్మాత 46 కోట్ల రూపాయల కోట్ చేశారట. వేదాక్షర మూవీస్ పతాకం మీద రామారావు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. మరి ఎవరికి రైట్స్ ఇస్తారో చూడాలి. ఆల్మోస్ట్ 50 కోట్లు పెట్టి రైట్స్ తీసుకున్న వాళ్లకు లాభాలు రావాలంటే మినిమమ్ 100 కోట్లు కలెక్ట్ చేయాలి.

Also Read'కన్నప్ప' ఓపెనింగ్ డే టార్గెట్ @ 100 కోట్లు... విష్ణు మంచు ఫస్ట్ డే సెంచరీ కొడతారా?

'కూలీ' రైట్స్ కోసం ఇంత క్రేజ్ నెలకొనడానికి ఓ కారణం అందులో నాగార్జున కూడా నటించడం. ఆయన రీసెంట్ హిట్ 'కుబేర'కు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ 50 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. రజనీకాంత్ - లోకేష్ కనకరాజ్ కాంబోకి తోడు నాగార్జున యాడ్ కావడం, ఇంకా ఇందులో అమీర్ ఖాన్, ఉపేంద్ర, పూజా హెగ్డే వంటి భారీ తారాగణం ఉండడంతో రైట్స్ కోసం అందరూ పోటీపడుతున్నారు.

Also Readఫ్రీడమ్ ఫైటర్‌గా ఎన్టీఆర్... 'డ్రాగన్'తో రూట్ మార్చిన ప్రశాంత్ నీల్?