ప్రశాంత్ నీల్ సినిమాలు చూసిన ప్రేక్షకులు అందరికీ ఆయన హీరోల గురించి ఒక క్లారిటీ ఉంటుంది. 'కేజీఎఫ్'లో రాకింగ్ స్టార్ యశ్ కావచ్చు... 'సలార్'లో రెబల్ స్టార్ ప్రభాస్ కావచ్చు... ఇద్దరినీ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్లలో చూపించారు దర్శకుడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు వచ్చేసరికి తన రూటు మార్చారట. గత సినిమాలతో పోలిస్తే హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌గా డిజైన్ చేశారట.

ఫ్రీడమ్ ఫైటర్‌గా ఎన్టీఆర్!?NTR role in Dragon Movie: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు 'డ్రాగన్' టైటిల్ ఖరారు చేశారు. ఆ సంగతి ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ టైటిల్ అదేనని అందరికీ తెలుసు. ఈ సినిమా కథ ఏమిటి? అనేది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... స్వాతంత్రం రావడానికి ముందు కాలంలో ఈ చిత్ర కథ సాగుతుందట. 

భారతదేశంలో 1960 నేపథ్యంలో 'డ్రాగన్' సినిమా ఉంటుందని, మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇందులో కథానాయకుడు స్వాతంత్ర సమరయోధుడు కింద కనిపించనున్నారని సమాచారం. 

ఫ్రీడమ్ ఫైటరే కానీ ఫుల్ ఫైర్...!?'కేజిఎఫ్', 'సలార్' సినిమాలలో కథానాయకులను ప్రభుత్వ వ్యవస్థలను, మరీ ముఖ్యంగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన డాన్స్ కింద కనిపించారు. 'కేజీఎఫ్' చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గరకు హెలికాప్టర్ వేసుకుని వెళతారు యష్. మరో పోలీస్ స్టేషన్ మీద తుపాకీ తూటాల వర్షం కురిపిస్తారు.

'సలార్'లో ప్రభాస్ సీల్ చూస్తే వణికిపోతారు బడా బడా డాన్స్ అందరూ! పోలీసులు సైతం ఆ సీల్ చూస్తే ఏమీ చేయరు. వ్యవస్థకు ఎదురు తిరగడంలో ఒక హీరోయిజం ఉంటుంది. మరి, ఫ్రీడమ్ ఫైటర్ అంటే? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు. 

Also Read: చిరంజీవి తల్లికి సీరియస్... అత్తాకోడళ్ల మధ్య ఫైటింగ్... రాంగ్ టైంలో వీడియో రిలీజ్

స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లకు ఎదురు తిరిగిన స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. వీరోచితంగా పోరాడిన యోధులు ఉన్నారు. ఆయా కథల్లో హీరోయిజం ఉంటుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా హీరోయిజం డిజైన్ చేశారట.

జూన్ 25, 2026న థియేటర్లలోకి సినిమా!NTR Neel's Dragon movie release date: ఎన్టీఆర్ - నీల్ సినిమా 'డ్రాగన్'ను వచ్చే ఏడాది జూన్ 25న థియేటర్లలోకి విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ కూడా వీళ్ళతో చేతులు కలిపింది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్. ఆవిడ సినిమాలో జాయిన్ అయినట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా షూటింగులో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన మీద సాంగ్ షూటింగ్ చేస్తున్నట్లు తెలిసింది.

Also Read'కన్నప్ప' ఓపెనింగ్ డే టార్గెట్ @ 100 కోట్లు... విష్ణు మంచు ఫస్ట్ డే సెంచరీ కొడతారా?