మెగా మదర్ అంజనా దేవి హెల్త్ కండిషన్ గురించి అభిమానులతో పాటు జనసేన పార్టీ శ్రేణులు ఎంక్వయిరీ చేస్తున్నాయి. ఏపీ క్యాబినెట్ సమావేశం నుంచి పవన్ కళ్యాణ్ మధ్యలో బయటకు రావడంతో ఆయన తల్లికి ఆరోగ్యం బాలేదని అందరికీ తెలిసింది. అయితే... ఈ సమయంలో 'అత్తమ్మాస్ కిచెన్' ఓ వీడియో విడుదల చేయడం పూర్తిగా రాంగ్ టైమింగ్ అని చెప్పాలి.
మెగా అత్తా కోడళ్ల మధ్య ఫైటింగ్...అంజనా దేవితో ప్రమోషనల్ వీడియో!మెగాస్టార్ చిరంజీవి సతీమణి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తల్లి సురేఖ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో రెడీ టు కుక్ పొంగలి - ఉప్మా - కేసరి, పులిహోర పేస్ట్ వంటివి అమ్ముతున్నారు. ఆవకాయ్ పచ్చడి కూడా స్టార్ట్ చేశారు.
'అత్తమ్మాస్ కిచెన్' నుంచి వచ్చే ఆవకాయ్ పచ్చడి ప్రమోషన్ కోసం అంజనా దేవితో ఒక ప్రమోషనల్ వీడియో రూపొందించారు. అందులో సురేఖతో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఉన్నారు. ఆవకాయ్ పచ్చడి కలుపుతున్న టైంలో రామ్ చరణ్ వస్తారు. 'మీ అమ్మ, నాన్నమ్మ ఫైటింగ్' అని ఉపాసన చెబుతారు. ఆ తర్వాత ఆవకాయ్ ఎంత శుభ్రంగా తయారు చేసిందీ చూపించారు. అన్నంలో పచ్చడి కలిపి అందరికీ ముద్దలు పెట్టడం కూడా చూపించారు.
Also Read: బ్రేకింగ్ న్యూస్: మెగా మదర్ అంజనాదేవి అనారోగ్యం... ఏపీ క్యాబినెట్ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చేసిన పవన్
అత్తా కోడళ్ల మధ్య ఫైటింగ్ (మీ అమ్మ, నానమ్మ ఫైటింగ్ చేస్తున్నారు) అని వీడియో స్టార్ట్ చేయడం, అదీ ఇవాళ ఉదయం సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం చాలా రాంగ్ టైమింగ్.
అంజనా దేవికి ఆరోగ్యం బాలేదు...ఈ టైంలో ఈ వీడియో రిలీజ్ ఎందుకు?అంజనా దేవి హెల్త్ సీరియస్‌గా ఉందని వార్తలు వస్తున్న సమయంలో ఈ వీడియో విడుదల చేయడం ఎందుకు? అని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ... ఆవకాయ్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తిందని విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు అంజనా దేవి హెల్త్ అప్డేట్ రాలేదు.